మెగాకు జోడిగా...అనుష్కా

by సూర్య | Tue, Jan 11, 2022, 12:04 PM

తెలుగు ఇండస్ట్రీయలో తిరుగులేని క్రేజ్ ఉన్న మెగాస్టార్ సరసనా ఇపుడు బ్యూటీ క్వీన్ అనుష్క నట్టించబోతోందటా. తెలుగు .. తమిళ భాషల్లో అనుష్కకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మధ్య కాలంలో అనుష్క నాయిక ప్రధానమైన పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చింది. ముఖ్యంగా సినిమాలను చాలావరకూ తగ్గించుకుంది. ఈ నేపథ్యంలో ఆమె యూవీ బ్యానర్లో ఒక సినిమా చేయనుందనే టాక్ మాత్రం వినిపిస్తోంది. ఇక ఇప్పుడు మరో సినిమా కోసం అనుష్కను ఒప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్టుగా చెప్పుకుంటున్నారు. అదీ మెగాస్టార్ చిరంజీవి సరసన కావడం వలన ఆమె ఒప్పుకోవచ్చని అంటున్నారు. చిరంజీవి కథానాయకుడిగా 'గాడ్ ఫాదర్' .. 'భోళా శంకర్' .. 'వాల్తేర్ వీర్రాజు' సినిమాలు పట్టాలెక్కాయి. ఈ సినిమాల్లో నయనతార .. తమన్నా .. శ్రుతిహాసన్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఇక ఆ తరువాత ప్రాజెక్టుగా చిరంజీవి .. వెంకీ కుడుముల సినిమా చేయనున్నాడు. ఈ సినిమా కోసమే అనుష్కను అడుగుతున్నారట. ఇదిలావుంచితే, 'ఛలో' .. 'భీష్మ' వంటి హిట్స్ ఇచ్చిన వెంకీ కుడుముల వినిపించిన కథ మెగాస్టార్ కి ఒక రేంజ్ లో నచ్చిందని మాత్రం చెప్పుకుంటున్నారు.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM