రాజశేఖర్'లో శివానీ రాజశేఖర్

by సూర్య | Tue, Jan 11, 2022, 10:16 AM

రాజశేఖర్ హీరోగా నటించిన తాజా చినరతం శేఖర్' ఇందులో ఆయన పెద్దకుమార్తె శివానీ రాజశేఖర్ కీలకపాత్రలో నటిస్తున్నారు. సినిమాలోనూ రాజశేఖర్ కుమార్తె పాత్రలో ఆయన కన్పించనుంది. .. వెండితెరపై తండ్రి తనయురాలు కలిసి కన్పించనున్న తొలి చిత్రమిదే.. తాజాగా సోమవారం యూనిట్ రాజశేఖర్ శివానీ రాజశేఖర్ స్టిల్స్ ను విడుదల చేసింది.. హీరోగా రాజశేఖర్ కు ఇది 31వ సినిమా , జీవితా రాజశేఖర్ దర్శకత్వం వహిస్తున్నారు.. స్క్రీన్ ప్లే కూడ ఆమె సమకూర్చారు. వంకాయలపాటి మురళీకృష్ణ సమర్పణలో పెగాసన్ సినీ కార్స్, టారస్ సినీ కార్స్, సుధాకర్ ఇంపెక్స్ పిఎల్, , త్రిపురా క్రియేషన్స్ పతాకాలపై బీరం సుధాకర్ రెడ్డి, శివాజీ రాజశేఖర్, శివాత్మికా రాజశేఖర్, వెంకట శ్రీనివాస్ బొగ్గరం నిర్మించిన సినిమా ఇది.. దర్శకుడురాలు జీవితా రాజశేఖర్ మాట్లాడుతూ, రాజశేఖర్ , శివానీ మధ్య సన్నివేశాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని అన్నారు. . నిజజీవితంలో ఎలా ఉంటారో సినిమాలో కూడ అలాగే ఉన్నారని అన్నారు. వారిద్దరూ చాలా సహజంగా నటించారని అన్నారు.. ఇప్పటికే విడుదలైన ప్రచారచిత్రాలు , ఫ గ్లింప్స్ , లవ్ గంట మోగిందంటే పాటకు అద్భుతమైన స్పందన లభించిందన్నారు.. సినిమా కూడ అదేస్థాయిలో ఆకట్టుకుంటుందనే నమ్మకం ఉందన్నారు.. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటిస్తామని అన్నారు. 


Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM