నూతన వ్యాపార రంగంలోకి విక్టరీ వెంకటేష్

by సూర్య | Tue, Jan 11, 2022, 12:53 AM

నూతన వ్యాపార రంగంలోకి సినీహీరో విక్టరీ వెంకటేష్ రంగ ప్రవేశం చేశారు. అంతేకాదు ఈ వ్యాపార రంగంలోకి దిగి విక్టరీ వెంకటేశ్ తెలివైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రశంసలు కూడా పొందుతున్నారు. భవిష్యత్తులో విద్యుత్ ఆధారిత వాహనాల ప్రాధాన్యత పెరుగుతుందన్న నేపథ్యంలో, వెంకటేశ్ కొత్త వ్యాపారం షురూ చేశారు. ఎలక్ట్రిక్ బైకులు, స్కూటర్లకు విద్యుత్ చార్జింగ్ సదుపాయం కల్పించే 'బైక్ వో' సంస్థలో వెంకీ పెట్టుబడులు పెట్టారు. ఆయన పెట్టుబడి మొత్తం ఎంతన్నది తెలియరాలేదు. అయితే 'బైక్ వో' సంస్థలో భాగస్వామ్యం మాత్రమే కాదు, ఆ సంస్థకు వెంకటేశ్ ప్రచారకర్తగానూ వ్యవహరించనున్నారు. 'బైక్ వో' సంస్థలో పెట్టుబడులపై వెంకటేశ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సంస్థ ఫ్రాంచైజీ నెట్ వర్క్ లో మహిళలకు అవకాశాలు ఉంటాయని, వారు పారిశ్రామికవేత్తలుగా ఎదిగేందుకు మంచి అవకాశమని పేర్కొన్నారు. 'బైక్ వో' చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ విద్యాసాగర్ రెడ్డి స్పందిస్తూ, వెంకటేశ్ తమ సంస్థలో పెట్టుబడులు పెట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. కాగా, మరో మూడేళ్లలో దేశవ్యాప్తంగా 20 వేల చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నది 'బైక్ వో' లక్ష్యంగా తెలుస్తోంది.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM