హీరోగా మారనున్న సింగర్ సిద్ శ్రీరామ్

by సూర్య | Mon, Jan 10, 2022, 06:31 PM

ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ హీరోగా మారనున్నారు. అయితే సింగర్లుగా మంచి క్రేజ్ తెచ్చుకుని హీరోలుగా మారిన సందర్భాలు చాలానే  ఉన్నాయి. తెలుగులో కూడా కొంతమంది సింగర్లు హీరోలుగా అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.. చాలా తక్కువ. కోలీవుడ్ లో అయితే జీవీ ప్రకాష్ కుమార్ .. హిప్ హాప్ తమిళ్ లాంటి సంగీత దర్శకులు తమ పనిని పక్కన పెట్టకుండా హీరోలుగా రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు, తమిళ భాషల్లో ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్ కూడా .. మణిరత్నం దర్శకత్వంలో హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడని వినికిడి. మణిరత్నం ఇటీవల తీసిన 'కడల్' చిత్రంతో సిద్ శ్రీరామ్ తమిళ పరిశ్రమలో గాయకుడిగా అరంగేట్రం చేశారు. ఆ సినిమాతో వెనుదిరిగి చూసుకోలేదు.
ఇప్పుడు అదే మణిరత్నం.. సిద్ శ్రీరామ్ హీరోగా పరిచయం కానున్నాడని అంటున్నారు. స్టోరీ డిస్కషన్స్ కూడా అయిపోయాయని అంటున్నారు. ప్రస్తుతం మణిరత్నం చేస్తున్న 'పొన్నియిన్ సెల్వన్' తర్వాత ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కవచ్చని అంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది చూడాలి.

Latest News
 
సుధీర్‌ బాబు ‘హంట్‌’ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ Sun, Oct 02, 2022, 10:57 PM
నాని 'దసరా' మూవీ ఫస్ట్ సింగిల్ అప్డేట్ Sun, Oct 02, 2022, 10:52 PM
ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న 'రంగ రంగ వైభవంగా' మూవీ Sun, Oct 02, 2022, 09:38 PM
ప్రభాస్ 'ఆదిపురుష్' మూవీ టీజర్ రిలీజ్ Sun, Oct 02, 2022, 08:51 PM
గంభీరంగా పలికిన ఆ డైలాగ్ తో ఆదిపురుష్ టీజర్ విడుదల Sun, Oct 02, 2022, 08:49 PM