సంక్రాంతి బరిలో యువ హీరోల చిత్రాలు..

by సూర్య | Mon, Jan 10, 2022, 04:28 PM

కరోనా వైరస్ సినీ పరిశ్రమలో కలకలం రేపుతోంది. భారీ బడ్జెట్ చిత్రాలన్నీ కేసుల సంఖ్య పెరగడంతో విడుదలను వాయిదా వేసుకున్నాయి. సంక్రాంతికి విడుదల కావాల్సిన 'ఆర్ఆర్', 'రాధే శ్యామ్', 'భీమ్లా నాయక్' తదితర చిత్రాల విడుదల వాయిదా పడింది. దీంతో యువ కథానాయకుల సినిమాలు సంక్రాంతి బరిలోకి దిగుతున్నాయి.


సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలు ఇవే: సంక్రాంతికి విడుదలవుతున్న భారీ చిత్రం ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, కృతిశెట్టి, రమ్యకృష్ణ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 14న విడుదల కానుంది. ఆశిష్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన 'రౌడీ బాయ్స్' జనవరి 14న విడుదల కానుంది. దిల్ రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన నటించిన 'హీరో' చిత్రం ఈ నెల 15న విడుదల కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ నటించిన 'సూపర్ మచ్చ' ఈ నెల 14న విడుదల కానుంది. ఈ సినిమాలో రియా చక్రవర్తి, రుచితా రామ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎప్పుడో విడుదల కావాల్సిన ఈ సినిమా అనారోగ్యం కారణంగా ఆలస్యంగా విడుదలైంది. ప్రిన్స్‌, నేహా జంటగా నటించిన 'ది అమెరికన్‌ డ్రీమ్‌' జనవరి 14న విడుదలకు సిద్ధమై.. ఆహా OTTలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Latest News
 
అక్టోబరు 5న సందడి చేయనున్న 'ది ఘోస్ట్' మూవీ Sat, Sep 24, 2022, 11:30 PM
'సీత రామం' 42 రోజుల వరల్డ్ వైడ్ కలెక్షన్స్ Sat, Sep 24, 2022, 09:01 PM
సెన్సార్ ఫార్మాలిటీలను క్లియర్ చేసుకున్న 'ది ఘోస్ట్‌' Sat, Sep 24, 2022, 08:57 PM
ఇంటెన్స్ గా 'రానా నాయుడు' టీజర్ Sat, Sep 24, 2022, 08:54 PM
OTT భాగస్వామిని లాక్ చేసిన 'కృష్ణ బృందా విహారి' Sat, Sep 24, 2022, 08:51 PM