కరోనా బారిన పడ్డ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్

by సూర్య | Thu, Nov 25, 2021, 10:24 AM

టాలీవుడ్ సీనియర్ కొరియోగ్రాఫర్ శివశంకర్ మాస్టర్ కరోనా బారిన పడ్డారు. ఆయనతో పాటు ఆయన కుటుంబం మొత్తం కరోనా బారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం శివశంకర్ మాస్టర్ గచ్చిబౌలిలోని ఎఐజి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. శివ శంకర్ మాస్టర్ ఆసుపత్రి బిల్లులు చాలా ఖర్చుతో కూడుకున్నాయని, ప్రస్తుతం శివ శంకర్ మాస్టర్ కుటుంబానికి అంత ఆర్థిక స్తోమత లేనందున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేయవలసిందిగా ఆయన కుమారుడు అజయ్ కృష్ణ మాస్టర్ కోరుతున్నారు. శివ శంకర్ మాస్టర్ డాన్స్‌‌కి తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ మంచి క్రేజ్ ఉంది. ‘మగధీర’, ‘బాహుబలి’, ‘అత్తారింటికి దారేది’ ఇలా వందలాది చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేశారు. ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఇక డాన్స్ మాస్టర్ గా కాకుండా నటుడుగా కూడా పలు సినిమాలలో కనిపించారు


 


 

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM