“నాటు నాటు” లిరికల్ వీడియోకి 2 మిలియన్స్ లైక్స్...!

by సూర్య | Sat, Nov 20, 2021, 11:38 AM

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇటీవల విడుదలైన నాటు నాటు మాస్ ఎండ్ లిరికల్ వీడియోకి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఈ పాటకు ఇప్పటివరకు రెండు మిలియన్లకు పైగా లైక్స్ వచ్చాయి. అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్ర ఖని కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News
 
'గుంటూరు కారం' 7వ పాట విడుదలపై తమన్ సూచన Thu, Apr 25, 2024, 03:44 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులో 'చారి 111' Thu, Apr 25, 2024, 03:42 PM
'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' స్మాల్ స్క్రీన్ ఎంట్రీకి తేదీ లాక్ Thu, Apr 25, 2024, 03:27 PM
'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' టీజర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Apr 25, 2024, 03:25 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల ఎప్పుడంటే...! Thu, Apr 25, 2024, 03:21 PM