'తలపతి 66'లో విజయ్ కొత్త పాత్రలో కనిపిస్తున్నాడా

by సూర్య | Thu, Nov 18, 2021, 11:16 PM

నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన తలపతి విజయ్ కొత్త చిత్రం 'బీస్ట్' షూటింగ్ ముగింపు దెసలో ఉంది   . మిగిలిన భాగాలను త్వరలో చిత్రీకరించడానికి బృందం మరోసారి జార్జియాకు వెళ్లనుంది మరియు అది డిసెంబర్ చివరి నాటికి పూర్తి అవుతుంది.  విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తుండగా, యోగి బాబు మరియు సెల్వరాఘవన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.మరికొద్ది నెలల్లో విజయ్ తన మొదటి ద్విభాషా చిత్రం 'తలపతి 66' షూటింగ్‌ని తమిళం మరియు తెలుగు భాషల్లో ఏకకాలంలో ప్రారంభించనున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్న  ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా థమన్ సంగీతం అందిస్తున్నారు. 'తలపతి 66'లో పారాప్లెజిక్ పేషెంట్‌గా నటించనున్నాడని వార్త హల్ చల్ చేస్తుంది. విజయ్ కి తెలుగులో మంచి మార్కెట్ ఉంది. అతని సినిమాలు ఇక్కడ మంచి కలెక్షన్స్ సాధించాయి.    

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM