“రాధే శ్యామ్” ఫస్ట్ సింగిల్ కి 10 మిలియన్ వ్యూస్...!

by సూర్య | Thu, Nov 18, 2021, 11:25 AM

రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం లో ప్రభాస్ హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా  తెరకెక్కుతున్న చిత్రం 'రాధే శ్యామ్'. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, వీడియోలు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ సినిమాలో ప్రభాస్ పాత్రకు సంబంధించిన వీడియో ఒకటి విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. అయితే తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ పాట వైరల్ అవుతోంది. అలాగే ఈ పాట యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో ఉంది. ఈ పాటకు ఇప్పటి వరకు 10 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి.

Latest News
 
'థగ్ లైఫ్' విడుదల అప్పుడేనా? Sat, Apr 20, 2024, 05:14 PM
'ఫ్యామిలీ స్టార్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Sat, Apr 20, 2024, 05:12 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'కేజీఎఫ్ 2' Sat, Apr 20, 2024, 05:03 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మనమే' టీజర్ Sat, Apr 20, 2024, 04:59 PM
ప్రియదర్శి - నభా నటేష్ చిత్రానికి క్రేజీ టైటిల్ లాక్ Sat, Apr 20, 2024, 04:58 PM