సినీ పరిశ్రమలో మరో విషాదం

by సూర్య | Thu, Nov 18, 2021, 09:01 AM

సినీ పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు ఆర్ఎన్ఆర్ మనోహర్ (61) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయనకు ఇటీవలే కరోనా ఇన్ఫెక్షన్ కూడా వచ్చింది. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు బుధవారం గుండెపోటు వచ్చింది. గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మనోహర్‌కి మంచి గుర్తింపు ఉంది. కొలంగల్, దిల్, తెన్నవన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ డాన్, వేదాళం, విశ్వాసం, కాంచన-3, అయోగ్య చిత్రాల్లో నటించారు. రీసెంట్ గా రిలీజైన ఆర్య టెడ్డీ సినిమాలో హీరోయిన్ తండ్రి పాత్రలో నటించింది. మనోహర్ మాసిలామణికి దర్శకత్వం కూడా వహించాడు. మనోహర్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM