'మహాత్మ గాంధీ' పై కంగనా అనుచిత వ్యాఖ్యలు.. వైరల్ అవుతున్న పోస్ట్

by సూర్య | Wed, Nov 17, 2021, 07:31 PM

బాలీవుడ్ హీరోయిన్ ఇంకా ఫైర్ బ్రాండ్ అని పిలువబడే కంగనా రనౌత్  వారం రోజుల క్రితం పద్మ అవార్డు అందుకున్న అనంతరం కంగన భారత స్వాతంత్య్రంపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా మరోసారి గాంధీజీ గురించి కూడా  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. మహారాష్ట్ర కాంగ్రెస్ కంగనపై లీగల్ చర్యలకు సిద్ధపడుతోంది. కొన్ని రోజుల క్రితం '1947లో గాంధీ నేతృత్వంలో వచ్చిన స్వాతంత్య్రం భిక్ష.. మనకు అసలైన స్వాతంత్య్రం వచ్చింది 2014లో' అంటూ కంగన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ మాటలపై మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకుడు నానా పటోలే.. కంగన మీద ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఈ సారి ఏకంగా జాతిపిత మహాత్మ గాంధీనే టార్గెట్ గా అనుచిత వ్యాఖ్యలు చేసింది. గాంధీ, నెహ్రు, ఇంకా మిగతా నేతలు నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను బ్రిటీష్ వారికి అప్పగించేందుకు సిద్ధపడ్డారు అనే హెడ్‌లైన్‌తో ఉన్న న్యూస్ క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ. 'మీరు గాంధీ అభిమానా? నేతాజీ మద్దతుదారులా? రెండూ అవడం కుదరదు. తెలివిగా నిర్ణయించుకోండి' అని రాసుకొచ్చింది. ఈ పేపర్ క్లిప్పింగ్‌లో గాంధీజీ, నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా వంటి నేతలు నేతాజీ దేశంలోకి ప్రవేశిస్తే అతన్ని బ్రిటీష్ వారికి అప్పగిస్తామని ఓ బ్రిటీష్ జడ్జీతో ఒప్పందం కుదుర్చున్నట్లు ఉంది. ఈ పేపర్ క్లిప్పింగ్‌ను షేర్ చేయడంతో పాటు 'భగత్‌సింగ్‌ను ఉరి తీయాలని గాంధీ కోరుకున్నారు. ఇందుకు తగిన ఆధారాలు కూడా ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది. "ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలి" అనే గాంధీజీ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేసారు. ఆలా చేస్తే వచ్చేది స్వాతంత్రం కాదని అది "భిక్షా" అవుతుందని దూమారం లేపే వ్యాఖ్యలు చేసారు కంగనా ఇపుడు ఈ వ్యాఖ్యలపై మారం రేగుతోంది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM