సినీ పరిశ్రమలో మరో విషాదం.. ప్రముఖ నటుడు మృతి..

by సూర్య | Wed, Nov 17, 2021, 06:22 PM

తమిళ నటుడు, దర్శకుడు ఆర్.ఎన్.ఆర్. మనోహర్ (61) ఇరవై రోజుల క్రితం కొవిడ్ 19 కారణంగా ఆయనను మెరుగైన వైద్యం నిమిత్తం హాస్పిటల్ లో చేర్చినట్టు కుటుంబసభ్యులు చెబుతున్నారు. అయితే ఈ రోజు ఉదయం గుండెపోటుతో ఆర్.ఎన్.ఆర్. మనోహర్ తుదిశ్వాస విడిచారని వైద్యులు తెలిపారు.
పలు తమిళ చిత్రాలలో మనోహర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. ‘కొళంగల్, దిల్, తెన్నవాన్, వీరమ్, సలీమ్, ఎన్నై అరిందాల్, నానుమ్ రౌడీ దాన్, వేదాలం, విశ్వాసం, కాంచన -3, అయోగ్య’ తదితర చిత్రాలలో ఆయన కీలక పాత్రలు పోషించారు. . ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న విశాల్ ‘సామాన్యుడు’ సినిమాలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.  ఇటీవల విడుదలైన ఆర్య ‘టెడ్డీ’ సినిమాలో హీరోయిన్ సాయేషా సైగల్ తండ్రిగా ఆయన నటించారు. నటుడు ఆర్.ఎన్.ఆర్. మనోహర్ మృతికి పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాన్ని తెలిపారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM