“నాటు నాటు” కి 40 మిలియన్ వ్యూస్

by సూర్య | Wed, Nov 17, 2021, 01:03 PM

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమురం భీంగా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఈ చిత్రంలో అలియా భట్, ఒలివియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌ని వేగవంతం చేసింది చిత్ర యూనిట్. తాజాగా ఈ చిత్రంలోని లిరికల్ వీడియో సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ కావడమే కాకుండా యూట్యూబ్ ని షేక్ చేసింది. ఇప్పటి వరకు ఈ లిరికల్ వీడియో అన్ని భాషల్లో కలిపి 40 మిలియన్లకు పైగా వ్యూస్ పొందింది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. అజయ్ దేవగన్, శ్రియా శరణ్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM