నాగ్ 'బంగార్రాజు' నుండి న్యూ అప్డేట్.?

by సూర్య | Tue, Nov 16, 2021, 07:50 PM

కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున కథానాయకుడిగా ఆయన సరసన నాయికగా రమ్యకృష్ణ సందడి చేయనున్న చిత్రం బంగార్రాజు.అంతేకాక ఇక ఈ సినిమాలో యువ జంటగా చైతూ .. కృతి శెట్టి కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి నాగలక్ష్మి పాత్రను రివీల్ చేయడానికి మేకర్స్ ఒక ముహూర్తం పెట్టారు. ఈ నెల 18వ తేదీ ఉదయం 10:18 నిమిషాలకు నాగలక్ష్మి పాత్రను రివీల్ చేయనున్నట్టు చెప్పారు. ఆకుపచ్చ గాజులను ధరించి .. రెండు చేతులతో నాగలక్ష్మి నమస్కరిస్తున్నట్టుగా ఒక ఫొటోను వదిలారు. ఆ ఫొటోను బట్టి ఆమె కృతి శెట్టి అనీ .. గ్రామీణ యువతి పాత్రను ఆమె పోషించిందనే విషయం అర్థమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ని బట్టి  కృతి శెట్టి ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే విషయం ఈ స్టిల్ ను బట్టి తెలిసిపోతోంది. ఇక ఎల్లుండి నాగలక్ష్మి లుక్ రివీల్ కోసం ఫ్యాన్స్ వెయిట్ టింగ్ లో ఉన్నారు.

Latest News
 
సెన్సార్ పూర్తి చేసుకున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 05:29 PM
ఓపెన్ అయ్యిన 'ఫ్యామిలీ స్టార్' ఓవర్సీస్ బుకింగ్స్ Thu, Mar 28, 2024, 05:28 PM
4M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'గేమ్ ఛేంజర్' లోని జరగండి సాంగ్ Thu, Mar 28, 2024, 05:10 PM
'ఓం భీమ్ బుష్‌' 6 రోజుల వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంతంటే...! Thu, Mar 28, 2024, 05:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ఎక్స్‌ట్రాఆర్డినరీ మ్యాన్' Thu, Mar 28, 2024, 05:02 PM