కాకినాడలో ప్రముఖ నటి సూర్యకాంతం పేరిట పోస్టల్ కవరు ఆవిష్కరణ

by సూర్య | Tue, Nov 16, 2021, 05:16 PM

గయ్యాళి అత్త పాత్రలకు పెట్టింది పేరు సూర్యకాంతం. తెరపై సూర్యకాంతం కనిపించగానే జనం జడుసుకొనేవారు. ‘గయ్యాళి’ పాత్రల్లో తరచూ కనిపించడం వల్ల ‘గయ్యాళి’ అన్నది సూర్యకాంతంకు పర్యాయపదంగా నిలచింది. సూర్యకాంతం 1924 అక్టోబర్ 28న సంప్రదాయ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సమీపంలోని వెంకట కృష్ణరాయ పురం ఆమె స్వస్థలం. ఆరేళ్ళ ప్రాయంలోనే నాట్యం, సంగీతంలో శిక్షణ తీసుకున్నారు. హిందీ పాటలు వింటూ చక్కగా నృత్యం చేసేవారు సూర్యకాంతం. అది చూసి సమీపబంధువులు కొన్ని ప్రదర్శనలు ఇప్పించారు. కొన్ని నాటకాల్లోనూ నర్తించారు. ఆ పై మదరాసు చేరి జెమినీ స్టూడియోస్ లో స్టాఫ్ ఆర్టిస్ట్ గా చేరారు. జెమినీ సంస్థ నిర్మించిన ‘చంద్రలేఖ’లో తొలిసారి తెరపై కనిపించారు. కొన్ని చిత్రాలలో నటించిన తరువాత ఎల్వీ ప్రసాద్ తెరకెక్కించిన ‘సంసారం’ చిత్రంలో శేషమ్మ పాత్రలో సూర్యకాంతం నటన ఆకట్టుకుంది.
అయితే, సూర్యకాంతం స్మారకార్థం పోస్టల్ శాఖ ఆమె పేరిట ప్రత్యేక కవరు రూపొందించింది. దీనిని ఈ నెల 18న ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో సూర్యకాంతం స్వస్థలం కాకినాడలో జరుగుతుందని కాకినాడ డివిజన్ పోస్టల్ సూపరింటిండెంట్ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎంపీ వంగా గీత, స్థానిక ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, నగర మేయర్ శివ ప్రసన్న, విశాఖ రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్ ఎం.వెంకటేశ్వర్లు హాజరుకానున్నారు.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భీమ్లా నాయక్' Thu, Mar 28, 2024, 02:43 PM
గేమ్ ఛేంజర్ : జరగండి సాంగ్ బడ్జెట్ ఎంతంటే....! Thu, Mar 28, 2024, 02:41 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'కలియుగం పట్టణంలో' Thu, Mar 28, 2024, 02:34 PM
'మనమే' నుండి ఫస్ట్ సింగల్ అవుట్ Thu, Mar 28, 2024, 02:32 PM
నేడే 'ఫైటర్‌రాజా' టీజర్‌ లాంచ్ Thu, Mar 28, 2024, 02:30 PM