సమంత మరో ఆసక్తికర పోస్ట్

by సూర్య | Wed, Oct 27, 2021, 12:09 PM

 నటి సమంత ఇటీవల తన భర్త నాగ చైతన్యతో విడాకుల తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే అనంతరం సోషల్‌ మీడియాలో ఆమె ఏం పోస్టు షేర్ చేసినా ఆసక్తికరంగా మారుతోంది. తాజాగా ఆమె మరో పోస్టు షేర్ చేశారు. అందులో ' మీ కూతురిని ఎవరు పెండ్లి చేసుకుంటారాని కంగారు పడకుండా తనని సమర్థంగా తీర్చిదిద్దండి. తన పెండ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు వాటిని తన చదువుకు ఖర్చు పెట్టండి. ఆమెను పెండ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం ముఖ్యం. అలాగే తనకు తనను తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి` అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ గా మారింది.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM