మరో ఆసక్తికర పోస్ట్‌ చేసిన సమంత

by సూర్య | Wed, Oct 27, 2021, 12:08 PM

నాగ చైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించిన తర్వాత సమంత సోషల్‌ మీడియాలో ఆసక్తికర పోస్టులు చేస్తోంది. ఆమె ఏం పోస్ట్ చేసినా అది సోషల్‌ మీడియాలో చర్చనీయాంశం అయిపోతుంది. తాజాగా పెయింటింగ్స్ వేస్తున్న ఫోటోలను, వీడియోలను సమంత పోస్ట్ చేసింది. వాటితో పాటు మరో ఆసక్తికర పోస్ట్‌ ను కూడా షేర్ చేసింది. ‘మీ కూతురిని ఎవరు పెళ్లి చేసుకుంటారాని కంగారు పడకండి. తనని సమర్థంగా తీర్చిదిద్దండి. ఆమె పెళ్లి కోసం డబ్బు ఆదా చేసే బదులు ఆమె చదువుకు డబ్బు ఖర్చు చేయండి. ఆమెను పెళ్లికి సిద్ధం చేసే ముందు తన కోసం తనని సిద్ధం చేయడం చాలా ముఖ్యం. అలాగే తనని తాను ప్రేమించుకోవడం, ఆత్మవిశ్వాసంతో ఉండటం నేర్పించండి. అలాగే ఇతరులకు అవసరం ఉన్న సమయంలో తను మార్గదర్శకంగా ఉండేలా సిద్దం చేయండి’ అంటూ సమంత పోస్ట్‌ చేశారు.

Latest News
 
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM
'బడే మియాన్ చోటే మియాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Fri, Apr 19, 2024, 07:41 PM
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM