రైతును ఆదుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల

by సూర్య | Wed, Oct 27, 2021, 07:50 AM

ఇటీవల సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రిలో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కప్పల లక్ష్మయ్య అనే రైతు ఇల్లు అగ్నికి ఆహుతైంది. బీరువాలో దాచుకున్న రూ.6 లక్షలు కూడా కాలిబూడిదయ్యాయి. పూరిల్లు కోల్పవడం, దాచుకున్న డబ్బు మంటల్లో కాలిపోవడంతో రైతు లక్ష్మయ్య వేదన వర్ణనాతీతం. ఆ రైతు పరిస్థితి గురించి టాలీవుడ్ దర్శకుడు శేఖర్ కమ్ములకు తెలిసింది. ఆయన ఎంతో చలించిపోయారు. వెంటనే రైతు కుటుంబంతో మాట్లాడి వారిలో ధైర్యం నింపారు. అంతేకాదు, రైతు లక్ష్మయ్య ఖాతాకు రూ.1 లక్ష బదిలీ చేశారు. తమ దీనస్థితి పట్ల స్పందించడమే కాకుండా, లక్ష రూపాయలు పంపిన దర్శకుడు శేఖర్ కమ్ములకు రైతు లక్ష్మయ్య కృతజ్ఞతలు తెలిపారు.

Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM