ఇక పై ఎవరూ సమంత వ్యక్తిగత వ్యవహారాల జోలికి వెళ్ళకూడడు: న్యాయస్థానం

by సూర్య | Tue, Oct 26, 2021, 06:19 PM

గత కొద్దిరోజుల క్రిందట తన పరువుకు నష్టం వాటిల్లేలా వార్తలు, కథనాలు ప్రసారం చేసిన మూడు యూట్యూబ్ ఛానళ్లపై కూకట్‌పల్లి కోర్టులో సమంత పరువు నష్టం దావా కేసు వేసిన సంగతి తెలిసిందే. సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీలతో పాటు వెంకట్రావు అనే అడ్వకేట్‌పైన సమంత పిల్ దాఖలు చేశారు. అయితే ఆ విషయం పై  విచారణ జరిగింది... టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంతకు కూకట్‌పల్లి హైకోర్టులో ఊరట దక్కింది. తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా వీడియోలు అప్‌లోడ్ చేస్తున్నారంటూ రెండు యూట్యూబ్ ఛానెల్స్(సుమన్ టీవీ, తెలుగు పాపులర్ టీవీ, టాప్ తెలుగు టీవీ), డాక్టర్ సీఎల్ వెంకట్రావుపై చర్యలు తీసుకోవాలని ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు.. యూట్యూబ్ ఛానెల్స్‌తో పాటు సీఎల్ వెంకట్రావు ప్రసారం చేసిన వీడియోల లింకులను వెంటనే తొలగించాలంటూ కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్‌నను పాస్ చేసింది.


ఇకపై ఎవరూ కూడా సమంత వ్యక్తిగత, కుటుంబ వ్యవహారాల జోలికి వెళ్ళకూడదని న్యాయస్థానం స్పష్టం చేసింది. అలాగే తన వ్యక్తిగత విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దంటూ సమంతను కోర్టు సూచించింది. సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు వినిపించారు. 

Latest News
 
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM
'బేబీ జాన్' నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్ Thu, Apr 25, 2024, 04:04 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయటానికి సిద్ధంగా ఉన్న 'రత్నం' Thu, Apr 25, 2024, 04:02 PM