`సర్కార్ వారి పాట` నుంచి న్యూ స్టిల్.. టీనేజ్ దావూద్ లా ఉన్నాడు కామెంట్స్.!

by సూర్య | Tue, Oct 26, 2021, 04:39 PM

లాంగ్ హెయిర్ .. లైట్ గడ్డం.. పక్క పాపిడితో ఎవరీ సూపర్ హీరో? గ్రే ట్రాక్ సూట్ .. డెనిమ్స్ జీన్స్ .. డార్క్ సన్ గ్లాసెస్ తో ఎవరీ యంగ్ డైనమిక్ హీరో? చూస్తుంటే టీనేజ్ హీరోలా ఛమక్కుమనిపిస్తున్నాడు. జిప్పర్ కింద నుండి బయటకు కనిపించే నల్లటి మ్యాచింగ్ టీ-షర్టును కూడా ధరించాడు. సూపర్ స్టైలిష్ లుక్ తో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న అతడు ఎవరో చెప్పాలా.. వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్ మహేష్.


`సర్కార్ వారి పాట` నుంచి స్టిల్ ఇది. మహేష్ బాబు తన గొడుగును తానే పట్టుకుని కనిపించడం చూస్తుంటే అతడిలోని సింప్లిసిటీని అర్థం చేసుకోవచ్చు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా ఆయనలోని డౌన్ టు ఎర్త్ నైజాన్ని కూడా ఈ స్టిల్ ఆవిష్కరిస్తోంది. ప్రస్తుతం స్పెయిన్ లో సర్కార్ వారి పాట మూవీకి సంబంధించిన పాటల చిత్రీకరణ సాగుతున్న సంగతి తెలిసిందే. మహేష్ - కీర్తి సురేష్ జంటతో పాటు నమ్రత కూడా అక్కడే ఉన్నారు. పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


ఈ ఫోటోని చూడగానే అతడికి యాభై అంటే నమ్మడం కష్టమే. జస్ట్ కాలేజ్ స్టడీస్ ముగించి ఇప్పుడు సెట్స్ లో అడుగుపెట్టిన కుర్రాడిలా కనిపిస్తున్నాడు! అంటూ ఒకటే ప్రశంసలు కురుస్తున్నాయి. ఇస్మార్ట్ బుల్లోడిలా టీనేజ్ దావూద్ లా ఉన్నాడు! అంటూ కొందరు ఫ్యాన్స్ మరీ పొగిడ్తల్లో ముంచేస్తున్నారు. సర్కార్ వారి పాట సంక్రాంతి 2022 కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసినదే.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM