ఆ రోజున 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానున్న 'గల్లీ రౌడీ'

by సూర్య | Tue, Oct 26, 2021, 04:32 PM

టాలీవుడ్ యంగ్ హీర్ సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన 'గల్లీ రౌడీ' చిత్రం థియేటర్లలో విడుదలై ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది. వినోదభరితంగా తెరకెక్కిన ఈ సినిమా సినీ అభిమానులను అలరించింది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది. నవంబర్ 4వ తేదీ నుంచి 'డిస్నీ ప్లస్ హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ కానుంది.


ఈ చిత్రంలో సందీప్ కిషన్ సరసన నేహాశెట్టి నటించింది. ఇతర ప్రధాన పాత్రలను రాజేంద్రప్రసాద్, వెన్నెల కిశోర్, పోసాని కృష్ణమురళి, నాగినీడు, బాబీ సింహ, హర్ష తదితరులు పోషించారు. గల్లీ రౌడీ అయిన సందీప్ కిషన్ తన ప్రియురాలికి వచ్చిన సమస్యను, తన తాత కోరికను ఎలా తీర్చాడన్నదే ఈ సినిమా కథాంశం.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM