సొంతంగా ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన 'అమలా పాల్'

by సూర్య | Tue, Oct 26, 2021, 04:19 PM

దక్షిణాది భాషల్లో అగ్రహీరోల సరసన పలు హిట్ చిత్రాల్లో నటించిన అమలాపాల్ కొత్తగా చిత్రనిర్మాణ రంగంలోకి ప్రవేశిస్తోంది. తన పేరు మీద అమలాపాల్ ప్రొడక్షన్స్ అంటూ చిత్రనిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. గత 12 ఏళ్లుగా చిత్రసీమలో కొనసాగుతున్నానని, ఈ పుష్కరకాలంలో తన కెరీర్ ఎంతో ఉజ్వలంగా సాగిందని, ఇప్పుడు కొత్త మార్గంలో పయనం ప్రారంభించానని అమలాపాల్ సోషల్ మీడియాలో వెల్లడించింది.


'కడావర్' పేరుతో తొలి చిత్రం నిర్మిస్తున్నానని, అందులో తాను నటిస్తున్నానని తెలిపింది. ఇదొక క్రైమ్ ఫోరెన్సిక్ థ్రిల్లర్ మూవీ అని వివరించింది. ఈ చిత్రానికి అనూప్ పణిక్కర్ దర్శకత్వం వహిస్తున్నట్టు అమలాపాల్ పేర్కొంది. అంతేకాదు, 'కడావర్' చిత్రంలో తన ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేసింది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM