మెగా హీరోతో బొమ్మరిల్లు భాస్కర్ మూవీ

by సూర్య | Tue, Oct 26, 2021, 11:18 AM

దర్శకుడు బొమ్మ‌రిల్లు భాస్కర్‌ బొమ్మరిల్లు, పరుగు చిత్రాలను తెర‌కెక్కించి త‌న కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు సాధించాడు. ఆ త‌ర్వాత ప‌లు వ‌రుస ప‌రాజ‌యాల‌ను ముట్టా క‌ట్టుకున్నాడు. ఇలా త‌న ఇమేజ్ క్ర‌మంగా త‌గ్గిపోతున్న త‌రుణంలో ఎలాగైనా హిట్‌ కొట్టాలనే కసితో దిమ్మ‌తిరిగే హిట్ కొట్టాడు. అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌, టాలీవుడ్ బుట్ట బోమ్మ పూజ హెగ్డేల‌తో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. బాక్సాఫీస్‌ వద్ద క‌లెక్ష‌న్ల వ‌ర్షం కురిపించారు. త‌నదైన మార్కును చూపించాడు.ఈ విజయంతో తాజాగా ఆయనకు మెగా ఆఫ‌ర్ త‌న త‌లుపు త‌ట్టింది. ప్ర‌ముఖ సినీ నిర్మాణ సంస్థ గీతాఆర్ట్స్ బ్యానర్‌లో భారీ బ‌డ్జెట్ సినిమాను తెర‌కెక్కించే అవకాశం వ‌రించింది. ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టులో మ‌రో ఇంట్రెస్టిక్ అంశమేమిటంటే.. ఈ సినిమాను మెగా హీరోతో చేయనున్నారని సమాచారం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే ‘ఆహా’ ఓటిటి కోసం కూడా బొమ్మరిల్లు భాస్కర్ ఓ చిత్రానికి పనిచేయబోతున్నట్లు తెలుస్తోంది.‘బొమ్మరిల్లు’, ‘పరుగు’ హిట్ ల త‌రువాత దాదాపు ఎనిమిదేండ్ల‌కు ‘మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌’ తో హీట్ కొట్టాడు డైరెక్ట‌ర్ భాస్క‌ర్ . 

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM