ఎన్టీఆర్ కొరటాల సినిమా క్రేజీ అప్డేట్...!

by సూర్య | Tue, Oct 26, 2021, 10:48 AM

జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. తారక్ తర్వాత సినిమాకు కొరటాల శివ డైరెక్టర్ కాగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా తెరకెక్కనున్నట్టు ఇప్పటికే ప్రకటన వెలువడింది. జనతా గ్యారేజ్ సినిమా తర్వాత తారక్ కొరటాల శివ కాంబినేషన్ లో ఈ మూవీ తెరకెక్కనుంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్ పూర్తైందని ఎన్టీఆర్ ఇంటికి దగ్గర్లోనే ఈ సెట్ ను నిర్మించామని కొరటాల శివ చెప్పుకొచ్చారు. తారక్ క్రేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొరటాల శివ స్క్రిప్ట్ లో స్వల్పంగా మార్పులు చేశారని కొరటాల తారక్ కాంబో మూవీ స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చిందని సమాచారం అందుతోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడీగా అలియా భట్ నటిస్తున్నారని వార్తలు వినిపిస్తుండగా త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చే ఛాన్స్ ఉంది.ఆర్ఆర్ఆర్ సినిమాలో చరణ్ కు జోడీగా అలియా నటిస్తుండగా ఆర్ఆర్ఆర్ తర్వాత అలియాకు తెలుగులో ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంది. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా వచ్చే నెల నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో మూవీ రిలీజ్ కానుంది.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM