మంచు మనోజ్‌, ఆర్జీవీల మధ్య ట్విటర్‌లో ఆసక్తికర సంభాషణ

by సూర్య | Mon, Oct 25, 2021, 04:39 PM

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నికలు ముగిసి రెండు వారాలు గడిచింది. ఈ ఎన్నికల్లో ప్రకాశ్‌ రాజ్‌పై మంచు విష్ణు విజయం సాధించి 'మా' అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నాడు. ఎన్నడూ లేని విధంగా ఈసారి వివాదాలు, విమర్శలు, ఆరోపణలతో 'మా' ఎన్నికలు వాడివేడిగా సాగాయి. ఇరూ ప్యానల్ల సభ్యులు ఒకరిపై ఒకరూ చేసుకున్న విమర్శ వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపాయి. ఈ నేపథ్యంలో పలువురు సినీ ప్రముఖులు 'మా' ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు.


ఈ క్రమంలో వివాదస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ స్పందిస్తూ తనదైన శైలిలో స్పందించాడు. 'మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఓ సర్కస్ అని, అందులో ఉండే సభ్యులంతా జోకర్లు' అంటూ వర్మ ట్వీట్ చేయగా.. దానికి మంచు మనోజ్‌.. 'మా ఒక సర్కస్ అయితే. మీరు రింగ్ మాస్టర్ సర్' అంటూ తనదైన శైలిలో కౌంటర్‌ ఇచ్చాడు. దీంతో ఈ ట్వీట్‌ నెట్టింట తెగ వైరల్‌ అయింది. అయితే ఇది జరిగిన పది రోజులకు తాజాగా వర్మ మనోజ్‌ కౌంటర్‌పై స్పందించాడు. మనోజ్‌ కామెంట్‌కు రీట్వీట్‌ చేస్తూ.. 'నేను రింగ్‌ మాస్టర్‌ కాదు. సర్కస్‌లో అందరికి వినోదం పంచే కోతిని మాత్రమే' అని రిప్లై ఇచ్చాడు.


దీనిపై మనోజ్‌ స్పందిస్తూ.. 'మనం అందరం ఒకటే సర్‌, సేమ్‌ సర్కస్‌కు చెందిన వాళ్లమే' అంటూ సమాధానం ఇచ్చాడు. దీనికి ఆర్జీవీ మరో ట్వీట్‌ చేస్తూ.. 'హే మనోజ్‌ మీ డీపీ స్టేటస్‌ కంటే 'మా' ఇంక గోప్పదని అనుకుంటున్నాను' అంటూ రిప్లై ఇవ్వగా దీనికి మనోజ్‌ 'సార్‌.. రిప్లై ఇచ్చారు.. మీరు చెప్పంది కరెక్ట్‌ సర్‌' అంటూ రీట్వీట్‌ చేశాడు. ఆ తర్వాత ఆర్జీవీ 'అవును' అంటూ సమాధానం ఇచ్చాడు. ఇలా ట్విటర్‌ వేదికగా వర్మ, మనోజ్‌ల మధ్య జరిగిన ఆసక్తికర సంభాషణ నెట్టింట చర్చనీయాంశంగా మారింది. వారి ట్వీట్స్‌పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.

Latest News
 
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదల ఎప్పుడంటే...! Thu, Mar 28, 2024, 08:24 PM
'గేమ్ ఛేంజర్' డిజిటల్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ ప్లాట్ఫారం Thu, Mar 28, 2024, 08:21 PM
'శ్రీరంగనీతులు' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి వెన్యూ లాక్ Thu, Mar 28, 2024, 08:19 PM
'శశివదనే' నుండి గోదారి అటువైపో సాంగ్ రిలీజ్ Thu, Mar 28, 2024, 08:17 PM
త్వరలో స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వనున్న 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' Thu, Mar 28, 2024, 08:15 PM