కాజల్ అగర్వాల్ స్థానంలో అమలాపాల్

by సూర్య | Mon, Oct 25, 2021, 04:28 PM

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న 'ది ఘోస్ట్' సినిమాలో హీరోయిన్ మారింది. గతంలో నాగ్‌కు జోడీగా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసుకున్న చిత్ర యూనిట్ తాజాగా ఆమె స్థానంలో అమలాపాల్‌ను తీసుకుంది. దీంతో నాగ్ సరసన కాజల్‌ను చూడాలన్న అభిమానుల ఆశలు ఆవిరయ్యాయి. అయితే దీనికి కారణం కాజల్ అనే చెప్పాలి. ఇప్పటికే నాగార్జున, కాజల్ మీద కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. కాజల్ గర్భవతి కావడంతో సినిమా షూటింగ్‌కు ఆటంకాలు ఏర్పడ్డాయి. దీంతో సినిమా మేకర్స్ కాజల్ స్థానంలో మరో హీరోయిన్‌ను తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


కాగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో 'ది ఘోస్ట్' మూవీ తెరకెక్కుతోంది. తాజాగా హీరోయిన్ మార్పుతో కాజల్‌తో తీసిన సన్నివేశాలను అమలాపాల్‌తో రీషూట్ చేయనున్నారు. అమలాపాల్ ఈ మూవీలో నాగ్‌తో రొమాన్స్ మాత్రమే కాకుండా యాక్షన్ సన్నివేశాల్లోనూ కనిపించనుంది. ఈ చిత్రంలో హీరో రా ఏజెంట్ పాత్రలో కనిపించనుండగా.. హీరోయిన్ అతడికి సహాయరాలి పాత్రలో కనిపిస్తుందని ప్రచారం జరుగుతోంది. ఈ మూవీలో హిందీ నటి గుల్ పనాగ్, అనిఖా సురేంద్రన్ కీలక పాత్రలు పోషించనున్నారు.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM