బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా

by సూర్య | Mon, Oct 25, 2021, 02:07 PM

టాలీవుడ్ లో యంగ్ హీరోల సంగతి పక్కన పెడితే స్టార్ హీరోలు మాత్రం పాన్ఇండియా సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈనేపథ్యంలోనే ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తో పాన్ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్నాడు. ఇక ఇన్ని రోజులు ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. దాదాపు మూడేళ్లు ఈసినిమా కోసమే ఎన్టీఆర్ వెయిట్ చేయాల్సి వచ్చింది. ఫైనల్ గా ఇటీవలే ఈసినిమా షూటింగ్ పూర్తవ్వడంతో ఇక తన నెక్స్ట్ సినిమాలపై ఎన్టీఆర్ ఫోకస్ పెడుతున్నాడు.ఇక ఇదిలాఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. బాలీవుడ్ డైరెక్టర్ తో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా వస్తున్నట్టు వార్తలు ఎప్పటి నుండో వస్తున్నాయి. ఈమధ్య ఆవార్తలు కాస్త తగ్గినా మరోసారి ఈన్యూస్ తెరపైకి వచ్చింది. పౌరాణిక నేపథ్యంలో సంజయ్ లీలా భన్సాలీ ఎన్టీఆర్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారట. అంతేకాదు తాజాగా ఎన్టీఆర్ ని కలిశారని.. కథా చర్చలు పూర్తయ్యాయని ఇక అధికారిక ప్రకటన మాత్రమే మిగిలి ఉందని అంటున్నారు. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన రావాల్సిందే.కాగా ఎన్టీఆర్ తన తరువాత సినిమా కొరటాల శివ తో చేయనున్నాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. 

Latest News
 
కన్నడ నటి హర్షిక పూనాచా, ఆమె భర్త పై దుండగులు దాడి Sat, Apr 20, 2024, 10:39 AM
'మంజుమ్మెల్ బాయ్స్' OTT రిలీజ్ డేట్ ఫిక్స్ Sat, Apr 20, 2024, 10:36 AM
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM