"ఆర్ఆర్ఆర్" మూవీ రన్ టైమ్...!

by సూర్య | Mon, Oct 25, 2021, 01:17 PM

టాలీవుడ్ తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్”. చాలా సస్పెన్స్ తరువాత “ఆర్ఆర్ఆర్” ను వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నాము అని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమా షూటింగ్ కొంతకాలం క్రితమే పూర్తి కాగా, ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే హీరోలిద్దరూ సినిమా డబ్బింగ్ కార్యక్రమాలను పూర్తి చేశారు. తాజాగా ఈ సినిమా రన్ టైం ఎంతనే విషయం సన్నిహిత వర్గాల ద్వారా తెలిసిందే. సినిమా అవుట్ ఫుట్ మొత్తం దాదాపు మూడు గంటలకు పైగా రాగా, దానిని ట్రిమ్ చేసి అనవసరమైన సన్నివేశాలను తొలగించారట. మొత్తానికి జక్కన్న ఈ సినిమాను చెక్కి చెక్కి 2 గంటల 45 నిమిషాలకు తీసుకొచ్చాడట. ఈ సినిమాపై కూడా అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయి. ఇక త్వరలోనే సినిమా ప్రమోషన్స్ ప్రారంభించనున్నారు. ప్రమోషన్ల కోసం రాజమౌళి సరికొత్త ప్లాన్స్ వేస్తున్నారు. ఇక ఈ చిత్రంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ కొమురం భీమ్ గా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించబోతున్నారు. కల్పితగాథతో రాజమౌళి ఎవరి అంచనాలకు అందకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇక బాలీవుడ్ బ్యూటీ అలియా భట్, హాలీవుడ్ భామ ఒలీవియా మోరిస్, శ్రియ శరన్, అజయ్ దేవగన్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. స్టార్ ప్రొడ్యూసర్ డీవీవీ దానయ్య తన బ్యానర్ పై అత్యంత్య భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు.


 


 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM