నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం

by సూర్య | Mon, Oct 25, 2021, 11:23 AM

నేడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం ఢిల్లీలో జరగనుంది. 2019వ సంవత్సరం నుంచి వచ్చిన చిత్రాలకు ప్రకటించిన అవార్డులను ఉదయం 11 గంటలకు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అందజేయనున్నారు. ఇందులో తెలుగు చిత్రాలకు ఐదు జాతీయ అవార్డులు దక్కాయి. జెర్సీకి రెండు, మహర్షికి మూడు అవార్డులు వచ్చాయి. జాతీయ ఉత్తమ తెలుగు చిత్రంగా జెర్సీ నిలిచింది. అలాగే.. జెర్సీ చిత్రానికి గాను బెస్ట్ ఎడిటర్‌గా నవీన్‌ అవార్డు సాధించారు.జాతీయ అవార్డుల్లో ఎవరూ ఊహించని విధంగా 3 నేషనల్ అవార్డులను దక్కించుకుంది మహర్షి మూవీ. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా తెలుగు భాషలో జాతీయ అవార్డు సొంతం చేసుకుంది మహర్షి. అలాగే ఈ సినిమాను నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ప్రొడక్షన్ హౌస్‌గా నేషనల్ అవార్డు గెలుచుకుంది. ఇదే చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్‌గా రాజు సుందరం జాతీయ అవార్డు పొందారు.జాతీయ ఉత్తమ నటిగా కంగనా రనౌత్ అవార్డు అందుకోనున్నారు. మణికర్ణిక, పంగా చిత్రాలకు.. కంగనా జాతీయ ఉత్తమ నటి అవార్డుకు ఎంపికయ్యారు. ఇక దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించిన చిచోరే.. ఉత్తమ హిందీ చిత్రంగా అవార్డు అందుకోనుంది. అసురన్‌ చిత్రంలో నటనకు ధనుష్‌ జాతీయ ఉత్తమ నటుడి పురస్కారం అందుకోనున్నారు.సూపర్ డీలక్స్‌ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు అవార్డు విజయ్‌సేతుపతికి దక్కింది. మలయాళం జల్లికట్టు సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రఫీగా గిరీష్ గంగాధరన్‌ అవార్డు అందుకోనున్నారు. బెస్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ అవార్డును మలయాళం మూవీ మరక్కర్‌ అందుకోనుంది.

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM