ఈ వారం కూడా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`దే హవా.!

by సూర్య | Sun, Oct 24, 2021, 06:35 PM

గతవారం విడుదలైన చిత్రాలతో బాక్సాఫీస్ గళ్లా నిండిన  సంగతి తెలిసిందే. అఖిల్ నటించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్`.. యంగ్ హీరో రోషన్ నటించిన `పెళ్లింసందడి` చిత్రాలు రిలీజ్ అయ్యాయి. బ్యాచిలర్ బ్లాక్ బస్టర్ అవ్వగా....పెళ్లి సందడని వివైడ్ టాక్ తో నడుస్తోంది. అయితే ఈ వారం కూడా ఈ రెండు చిత్రాలే ఎన్ క్యాష్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నారు. ఈ శుక్రవారం రిలీజ్ అయిన సినిమాలేవి పెద్దగా సక్సెస్ అయినట్లు కనిపించలేదు. విడుదలైన సినిమాలన్నీ మీడియం బడ్జెట్ చిత్రాలు కావడం..వాటికి తోడు కంటెంట్ లేని సినిమాలుగా ప్రేక్షకులు తేల్చేసారు. మూడు నాలుగు సినిమాలు రిలీజ్ అయినా కాస్తో కూస్తో బజ్ ఉన్న చిత్రం `నాట్యం` మాత్రమే.

మెగా పవర్ స్టార్ చరణ్ ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అతిధిగా రావడం..చిరంజీవి..బాలకృష్ణ లు ప్రమోట్  చేయడంతో  సినిమా ఆడియన్స్ కి రీచ్ అయింది. కానీ సినిమా అంచనాల్ని అందుకోలేకపోయింది. సినిమా తీసిన ఉద్దేశం మంచిదే అయినా కథనం బోరింగ్ గా సాగడంతో నీరసించినట్లు కనిపిస్తుంది. పేరున్న నటీనటులు కూడా  లేకపోవడం సినిమాకు మైనస్ గా చెప్పొచ్చు. తొలిరోజే థియేటర్లు వెలవెలబోయాయి. ఇక `మధుర వైన్స్` అనే క్రేజీ టైటిల్ తో మరో చిత్రం రిలీజ్ అయింది. ఈ సినిమాకు మంచి టాక్ రాలేదు. దానికి తోడు సరైన ప్రచారం కూడా లేకపోవడంతో సినిమా ప్రేక్షకుల్లోకి వెళ్లలేదు.

శ్రీరామ్ హీరోగా నటించిన  హారర్ థ్రిల్లర్ `అసలేం జరిగిందంటే` కూడా ఆకట్టుకోలేదు. కాన్సెప్ట్ బాగున్నా మేకింగ్ వైఫల్యాలు కనిపిస్తున్నాయి. లేదంటే శ్రీరామ్ కి తెలుగు వాడు అన్న సాప్ట్ కార్న్ వర్కౌట్ అయ్యేది. తెలిసిన నటుడు కాబట్టి ఆడియన్స్ చూసే ఛాన్స్ ఉండేది.  `క్లిక్` అనే మరో సినిమా కూడా రిలీజ్ అయింది. ఆ సినిమా పరిస్థితి అంతే. ఇలా ఈ శుక్రవారం చిన్న సినిమాలే రిలీజ్ అయ్యాయి..కానీ ఏ సినిమాకి మంచి టాక్ రాకపోవడంతో గత వారం రిలీజ్ అయిన సినిమాలే ఎన్ క్యాష్ చేసుకునే అవకాశ కనిపిస్తుంది.

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM