`మాస్టర్‌ చెఫ్‌ తెలుగు` షో కి లీగల్ నోటీసులు పంపిన తమన్నా.. కారణం ఆ యాంకరా.?

by సూర్య | Sun, Oct 24, 2021, 01:13 PM

ఇన్నాళ్లు హీరోయిన్‌గా అల‌రించిన తమన్నా ఇటీవల తొలిసారి యాంకర్ గా ఓ షోకి వ్యవహరించింది. తమన్నా యాంకర్ గా వ్యవహరించిన షో `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు`. రకరకాల కొత్త వంటలను పరిచయం చేస్తూ కుకింగ్‌ లో కాంపిటేషన్ పెట్టే షో ఇది. జెమిని టీవిలో ప్రసారమయ్యే ఈ షోకి ఇన్నాళ్లు తమన్నా హోస్ట్‌గా వ్యవహరించింది. తాజాగా ఆమె స్థానంలో అనసూయను తీసుకొచ్చారు షో నిర్వాహకులు. అయితే తమన్నా హోస్ట్ చేసే ఈ షోకి అంతగా పాపులారిటీ, రేటింగ్‌ రావడం లేదట. తమన్నా తెలుగులో అంత పర్ఫెక్ట్ కూడా కాకపోవడంతో షో అంతగా క్రేజ్ సంపాదించుకోలేదు. దీంతో బుల్లితెరపై అందం చూపిస్తూ హోస్ట్ గా కూడా అదరగొట్టే అనసూయని ఈ షో కోసం తీసుకొచ్చారు.


త‌మ‌న్నా స్థానంలో అన‌సూయ‌ని తీసుకొస్తే షోకి రేటింగ్ వస్తుందని భావించారు నిర్వాహకులు. అయితే తాజాగా `మాస్టర్‌ చెఫ్‌ తెలుగు` షో నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్‌కు తమన్నా షాకిచ్చింది. త‌నను తొలగించడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న త‌మ‌న్నా ఈ షో ప్రొడక్షన్ హౌస్ ఇన్నోవేటివ్ ఫిల్మ్ అకాడమీపై తన లాయర్ చేత నోటీసులు పంపించిందని సమాచారం. తనకు ఆ షో నుంచి రావాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ప్రొడక్షన్ హౌస్‌కు నోటీసులు పంపినట్లు తెల్సుతుంది. ఈ నోటీసులపై ప్రొడక్షన్ హౌస్ ఎలా స్పందిస్తుందో చూడాలి. తమన్నా వెళ్లిపోవడంతో అనసూయకి కలిసొచ్చింది అని అంటున్నారు ప్రేక్షకులు. మరి అనసూయ తన అందచందాలతో తన యాంకరింగ్ తో షోకి ఏ రేంజ్ హైప్ తెస్తుందో చూడాలి.

Latest News
 
కొత్త విడుదల తేదీని లాక్ చేసిన 'లవ్ మి - ఇఫ్ యు డేర్' Wed, Apr 24, 2024, 07:54 PM
15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'మిరాయి' టైటిల్ టీజర్ Wed, Apr 24, 2024, 07:52 PM
మరో రెండు రోజులలో 'టిల్లు స్క్వేర్' OTT ఎంట్రీ Wed, Apr 24, 2024, 06:21 PM
'థగ్ లైఫ్‌' సెట్స్ లో జాయిన్ అయ్యిన త్రిష Wed, Apr 24, 2024, 06:19 PM
3M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'ఆ ఒక్కటి అడక్కు' ట్రైలర్ Wed, Apr 24, 2024, 06:17 PM