'రాధే శ్యామ్' టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్

by సూర్య | Sun, Oct 24, 2021, 11:16 AM

బాహుబలి' సినిమా రాజ్యం  .. ఆధిపత్యం .. పోరాటం అనే అంశాల చుట్టూ తిరుగుతుంది. ఆ తరువాత ప్రభాస్ చేసిన 'సాహో' భారీ యాక్షన్ నేపథ్యంలో నడుస్తుంది. ఈ రెండు సినిమాల్లో కూడా రొమాన్స్ పాళ్లు తక్కువ. అందువలన ఈ సారి రొమాన్స్ పాళ్లు ఎక్కువగా దట్టించిన 'రాధే శ్యామ్' సినిమాతో ప్రభాస్ పలకరించనున్నాడు.


రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, యూవీ క్రియేషన్స్ - గోపికృష్ణ మూవీస్ సంస్థల నుంచి వస్తోంది. నిన్న ప్రభాస్ పుట్టినరోజు కావడంతో, ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. ఫస్టు పోస్టర్స్ మాదిరిగా రొమాన్స్ తో కూడిన బిట్స్ తో ఈ టీజర్ ఉంటుందని అంతా అనుకున్నారు.


కానీ ప్రభాస్ .. విక్రమాదిత్య పాత్రపై ఆసక్తిని రేకెత్తిస్తూ ఈ టీజర్ ను కట్ చేశారు. ఇప్పుడు ఈ టీజర్ ఒక రేంజ్ లో దూసుకుపోతోంది. 20 గంటల్లోనే ఈ టీజర్ 30 మిలియన్ లకి పైగా వ్యూస్ ను రాబట్టడం విశేషం. అదే స్పీడ్ తో కొత్త రికార్డుల దిశగా దూసుకుపోతూనే ఉంది. జనవరి 14వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM