దుల్కర్ 'కురుప్' రిలీజ్ డేట్ ఫిక్స్

by సూర్య | Sat, Oct 23, 2021, 07:32 PM

మలయాళ స్టార్ హీరోలలో దుల్కర్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. తమిళ .. తెలుగు భాషల్లోను ఆయనకి మంచి గుర్తింపు ఉంది. ఆయన తాజా చిత్రమైన 'కురుప్' పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతోంది. వివిధ భాషల్లో ఈ సినిమాను నవంబర్ 12వ తేదీన విడుదల చేయనున్నారు.


ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ, పోస్టర్ ను వదిలారు. ఇది క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగే కథ. పోస్టర్ చూస్తుంటే కథలో అనేక పాత్రలు .. అనూహ్యమైన మలుపులు ఉంటాయనే విషయం అర్థమవుతోంది. తెలుగులోను ఈ సినిమాను అదే టైటిల్ తో విడుదల చేస్తుండటం విశేషం.


మలయాళంలో ఈ సినిమాకి దుల్కర్ నిర్మాతగా వ్యవహరించాడు. సుశీన్ శ్యామ్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాకి, శ్రీనాథ్ రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. ఇంద్రజిత్ సుకుమారన్ ..  సన్నీ .. శోభిత ధూళిపాళ .. ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు. థియేటర్లకు వస్తున్న ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM