మెగా హీరో జోడీగా 'పెళ్లి సందD' హీరోయిన్?

by సూర్య | Sat, Oct 23, 2021, 07:16 PM

పెళ్లి సందD' సినిమాతో తెలుగు తెరకి శ్రీలీల కథానాయికగా పరిచయమైంది. ఈ సినిమా కథాకథనాల సంగతి అటుంచితే, గ్లామర్ పరంగా ఈ సుందరి మంచి మార్కులు కొట్టేసింది. యూత్ మనసులను మొత్తంగా దోచేసింది. విశాలమైన కళ్లు .. ఆకర్షణీయమైన నవ్వు ఆమె అందాన్ని రెట్టింపు చేస్తుంటాయని చెప్పుకుంటున్నారు.


రాఘవేంద్రరావు పరిచయం చేసిన కథానాయిక గురించి పెద్దగా ఆలోచన చేయవలసిన అవసరం లేదనే విషయం అందరికీ తెలిసిందే. అందువలన ఈ బ్యూటీకి వరుస అవకాశాలు వస్తున్నాయట. తాజాగా ఆమె మరో సినిమాను ఒప్పుకుందనే టాక్ ఇండస్ట్రీలో బలంగానే వినిపిస్తోంది.  


తెలుగులో తన రెండో సినిమాగా శ్రీలీల .. రవితేజ సరసన 'ధమాకా' చేస్తోంది. నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా, రీసెంట్ గా ఫస్టు షెడ్యూల్ ను పూర్తిచేసుకుంది. ఇక ఆ తరువాత సినిమాను మెగా ఫ్యామిలీ హీరోతో చేయనున్నట్టుగా ఒక వార్త వినిపిస్తోంది. మరి మెగా ఫ్యామిలీలో ఏ హీరోతో చేయనుందో .. ఈ సినిమాకి దర్శక నిర్మాతలు ఎవరో త్వరలోనే తెలియనుంది.  

Latest News
 
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM
'పుష్ప 2' ఫస్ట్ సింగల్ విడుదల అప్పుడేనా? Tue, Apr 23, 2024, 07:33 PM
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'శర్వా 36' Tue, Apr 23, 2024, 07:30 PM