రజనీ పెద్దన్న టీజర్.. పల్లెటూరోడు కోప్పడితే వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు!

by సూర్య | Sat, Oct 23, 2021, 06:02 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం అన్నత్తె. యాక్షన్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శివ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్.. లేడీ సూపర్ స్టార్ నయనతారతో పాటు సీనియర్ బ్యూటీ మీనా కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో మరో సీనియర్ స్టార్ హీరోయిన్ ఖుష్బు కూడా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాను తెలుగులో పెద్దన్న అనే టైటిల్ తో విడుదల చేస్తున్నారు.


తాజాగా ఈ మూవీ టీజర్‌ని విక్టరీ వెంకటేశ్‌ విడుదల చేశాడు. రజనీకాంత్‌ ఫ్యాన్స్‌ కోరుకునే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నట్లు టీజర్‌ చూస్తే అర్థమవుతంది. రజనీకాంత్‌ లుక్స్‌, నటన ఆకట్టుకునేలా ఉన్నాయి. 'పల్లెటూరోడు కోప్పడితే.. ఉప్పెనరా.. వాడికి అడ్డూ లేదు.. ఒడ్డూ లేదు' అనే డైలాగ్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. దీపావళి సందర్భంగా ఈ చిత్రం నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM