ఫైనల్ షెడ్యుల్ లో అడివి శేషు ' మేజర్'

by సూర్య | Sat, Oct 23, 2021, 03:01 PM

టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేషు గురించి కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. క్షణం, గూడా చారి, ఎవరు వంటి సూపర్ హిట్ చిత్రాల లో నటించారు. ఇక ప్రస్తుతం మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న మేజర్ సినిమాలో నటిస్తున్నాడు. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేషు సరసన సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది.ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ అప్డేట్ బయటకు వచ్చింది.అది ఏంటంటే ఈరోజు నుంచి ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ స్టార్ట్ అయింది. ఇక శశికిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సోని పిక్చర్స్ తో సంయుక్తంగా మహేష్ బాబు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేయనున్నారు.


 


 





Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM