శ్రీముఖి పిక్స్‌ వైరల్ ...

by సూర్య | Sat, Oct 23, 2021, 02:45 PM

యాంకర్ శ్రీముఖి గురించి ప్రత్యేకంగా చేప్పాల్సిన పనిలేదు. తన అందచందాలతో చురుకైన మాటలతో యాంకరింగ్ చేస్తూ తెలుగువారిని గత కొన్నేళ్లుగా అలరిస్తూనే ఉంది. అది అలా ఉంటే ఆమె తాజాగా ఓ ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోల్లో శ్రీముఖి అదరగొట్టిందనే చెప్పాలి. సెక్సీ లుక్‌లో కేకపెట్టించింది. దీంతో నెటిజన్స్ ఫిదా అవుతున్నారు. దానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


ఇక ఆ మధ్య కొన్ని రోజులు యాంకరింగ్ కొంత విరామం ఇచ్చి.. తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్‌ మూడవ సీజన్‌లో శ్రీముఖి పాల్గోన్న సంగతి తెలిసిందే. అంతేకాదు బిగ్ బాస్ రన్నరప్‌గా నిలిచి మరింత పాపులర్ అయ్యింది శ్రీముఖి. ఇక ప్రస్తుతం అదిరిపోయే షోలతో అదరగొడుతోన్న శ్రీముఖి ఓ వైపు ప్రోగ్రామ్స్‌కు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాలను చేస్తోంది.


శ్రీముఖి ప్రధాన పాత్రలో క్రేజీ అంకుల్స్ అనే సినిమా ఆ మధ్య విడుదలైంది. ఈ సినిమాకు దర్శకుడు ఇ. సత్తిబాబు. ఈ సినిమాలో ముగ్గురు క్రేజీ అంకుల్స్‌గా రాజా రవీంద్ర, మనో, భరణి నటించారు. ఈ సినిమాను గుడ్‌ సినిమా గ్రూప్‌, శ్రీవాస్‌ 2 క్రియేటివ్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ఇక అది అలా ఉంటే శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టు ఓ వార్త ప్రస్తుతం ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతోన్న అయితే శ్రీముఖి వాటిపై ఇంక స్పందించలేదు. దీంతో ఆమె అభిమానులు, నెటిజన్స్ బహుశా శ్రీముఖి ప్రేమించి పెళ్లి చేసుకోనుందని భావిస్తున్నారు. కాగా ప్రస్తుతం వినిపిస్తోన్న వదంతులు నిజమేనా? అంటే కాలమే సమాధానం చెప్పాలి. 




 


 


 

Latest News
 
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీ ఖరారు చేసిన 'చంద్రముఖి 2' Thu, Apr 25, 2024, 09:26 PM
సాలిడ్ టిఆర్పీని నమోదు చేసిన 'లియో' Thu, Apr 25, 2024, 09:23 PM
అనుపమ తదుపరి టైటిల్ మరియు కాన్సెప్ట్ వీడియోని లాంచ్ చేయనున్న సమంత, రాజ్ అండ్ DK Thu, Apr 25, 2024, 09:19 PM
'ఫ్యామిలీ స్టార్' నుండి దేఖో రే దేఖో వీడియో సాంగ్ అవుట్ Thu, Apr 25, 2024, 09:17 PM
షాకింగ్ టిఆర్పిని నమోద చేసిన 'ఆదికేశవ' Thu, Apr 25, 2024, 09:13 PM