నాన్న నిన్ను ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా చేస్తా : ఆకాశ్‌ పూరీ

by సూర్య | Sat, Oct 23, 2021, 11:03 AM

ఆకాశ్‌ కథానాయకుడిగా నటించిన 'రొమాంటిక్‌' చిత్రం మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరంగల్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించారు. పూరీ గురించి మాట్లాడుతూ ఆకాశ్‌ ఎమోషనల్‌ అయ్యారు. పూరీపై వచ్చిన కామెంట్లు చూసి తాను ఎంతో బాధకు లోనయ్యానని అన్నారు.'' సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా విచ్చేసిన విజయ్‌కి థ్యాంక్యూ. విజయ్‌.. మీ వర్క్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. 'లైగర్‌'లో కొన్ని సీన్స్ చూశాను. మీరు అద్భుతంగా నటించారు. ఆ సినిమా సక్సెస్‌ మామూలుగా ఉండదు. ఇక, మా సినిమా 'రొమాంటిక్‌' విడుదల కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. దర్శకుడు, మా బృందం అంతా ప్రాణం పెట్టి ఈ సినిమా చేశాం.'' ''మా నాన్న గురించి మాట్లాడాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు ఆ అవకాశం వచ్చింది. నర్సీపట్నంలో పుట్టి, ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా ఇండస్ట్రీ అనే మహా సముద్రంలోకి దూకి కష్టపడి పైకి వచ్చాడు మా నాన్న. కుటుంబం, బంధువులు, స్నేహితులందరి బాధ్యతలను భుజాలపై వేసుకుని ఆయన ప్రయాణం ప్రారంభించారు. అంతా బాగుంది అనుకునే సమయంలో ఓ వ్యక్తిని నమ్మడం వల్ల సాఫీగా సాగే ప్రయాణం అనుకోకుండా ఆగిపోయింది. అయినా సరే, మమ్మల్ని సురక్షితంగా చూసుకుంటూ ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. 'పూరీ కెరీర్‌ అయిపోయింది', 'రొటీన్‌ సినిమాలు చేస్తున్నాడు'.. ఇలాంటి కామెంట్లు చూసి బాధపడ్డాను. అలాంటి కామెంట్లు చేసిన వాళ్లందరికీ ఇప్పుడు ఒక్కటే చెబుతున్నా.. 'ఇస్మార్ట్‌ శంకర్‌'తో మళ్లీ మా నాన్న హిట్‌ కొట్టాడు. ఆ సినిమా సక్సెస్‌ చూసి నేను కాలర్‌ ఎగరేసుకున్నా. 'నాన్నా.. నీ కొడుకుగా పుట్టడం నా అదృష్టం. కానీ ఏదో ఒక రోజు నువ్వు గర్వపడేలా చేస్తా. ప్రతి సినిమాలో ప్రాణం పెట్టి నటిస్తా. ఎన్ని సంవత్సరాలైనా సరే.. నేను కష్టపడి నువ్వు కాలర్‌ ఎగరేసుకునేలా చేస్తా'' అని ఆకాశ్‌ పూరీ భావోద్వేగంతో మాట్లాడారు. తనయుడి మాటలు విన్న పూరీ పుత్రోత్సాహంతో ఆనందభాష్పాలు పెట్టుకున్నారు. 

Latest News
 
మంగళవారం డైరెక్టర్‌ అజయ్ భూపతికి అరుదైన ఘనత Tue, Apr 16, 2024, 10:19 PM
50M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Tue, Apr 16, 2024, 08:22 PM
'ప్రతినిధి 2' నుండి గల్లా యెత్తి సాంగ్ అవుట్ Tue, Apr 16, 2024, 08:20 PM
మలయాళ సినిమా రీమేక్‌ లో తరుణ్ భాస్కర్ Tue, Apr 16, 2024, 08:18 PM
విశ్వంభర - అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్న మెగాస్టార్ అంకితభావం Tue, Apr 16, 2024, 08:17 PM