సుధా చంద్రన్‌కు సీఐఎస్‌ఎఫ్ క్షమాపణ

by సూర్య | Sat, Oct 23, 2021, 07:45 AM

నాట్య మయూరి సుధాచంద్రన్‌కు కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం క్షమాపణలు చెప్పింది. ఇటీవల సుధాచంద్రన్‌కు విమానాశ్రయంలో తీవ్ర అవమానం జరిగింది. ఆమె కృత్రిమ కాలును తొలగించాల్సింగా సీఐఎస్ఎఫ్ సిబ్బంది కోరింది. దాంతో ఆమె ఓ వీడియో రూపంలో తన ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సీఐఎస్‌ఎఫ్ స్పందిస్తూ సుధా చంద్రన్‌కు ట్వీట్టర్ ద్వారా క్షమాపణలు కోరింది. అలాగే తనిఖీల్లో భాగంగా ఇలా జరిగిందని, అది తమ డ్యూటీ అని సీఐఎస్‌ఎఫ్ పేర్కొంది. అయితే సుధాచంద్రన్ పట్ల వ్యవహరించిన తీరుపై పరిశీలన చేసి, ప్రయాణికులకు అసౌకర్యంగా కలగకుండా తమ సిబ్బందికి సూచనలు ఇస్తామని ట్వీట్‌లో తెలియజేసింది. మళ్లీ ఇటువంటివి రిపీట్ కాకుండా సిబ్బందికి తెలియజేస్తామని సుదాచంద్రన్‌కు సీఐఎస్ఎఫ్ హామీ కూడా ఇచ్చింది. సుధాచంద్రన్ తన కృత్రిమ కాలుతోనే నృత్య ప్రదర్శనలు ఇచ్చి ఎంతో మంది స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తి. నటిగా, నృత్యకారణిగా ఆమె ఇంకా కొనసాగుతూనే ఉన్నారు.

Latest News
 
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM
రేపే 'కృష్ణమ్మ' ట్రైలర్ విడుదల Thu, Apr 25, 2024, 04:14 PM
2M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పోటెల్' టీజర్ Thu, Apr 25, 2024, 04:09 PM