వ్యభిచారం చేస్తూ పట్టు బడ్డ ప్రముఖ స్టార్ పియానిస్ట్

by సూర్య | Fri, Oct 22, 2021, 10:28 PM

ప్రముఖ స్టార్ పియానిస్ట్ వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యాడు. ఈ మేరకు చైనా ప్రభుత్వం ఆయనను జైలుకు పంపింది. ప్రభుత్వ క్రమశిక్షణను సవాల్ చేస్తే ఎవరికైనా క్రమశిక్షణను సవాల్ చేస్తే ఇదే పరిస్థితి తప్పదని హెచ్చరించింది. వినోద పరిశ్రమపై అధ్యక్షుడు జిన్ పింగ్ ఉక్కుపాదం మోపుతున్నారని చైనా అధికారిక మీడియా పేర్కొంది.


చైనాలో ప్రిన్స్ ఆఫ్ పియానోగా పేరుగాంచిన లి యుండి చిక్కుల్లో పడ్డాడు.అతడిని వ్యభిచార ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం రాత్రి లియుండి ఓ సెక్స్ వర్కర్ తో ఉండగా పట్టుబడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. లీయండీని గురువారం రాత్రి అరెస్ట్ చేసినట్లు చైనా మీడియా సీసీటీవీ తెలిపింది.


ఓ మహిళను ఎంగేజ్ చేసుకున్నట్టు తమకు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. అక్కడ పోలీసులు చెన్ అనే 29 ఏళ్ల మహిళను 39 ఏళ్ల లీని అరెస్ట్ చేశారు. లియుండీతోపాటు సెక్స్ వర్కర్ ను పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా చైనా అధికారిక మీడియా పీపుల్స్ డైలీ తెలిపింది. కొంతమంది ప్రముఖులు తరచూ సామాజిక మనస్సాక్షి నైతికత చట్టం గౌరవాన్ని సవాల్ చేస్తున్నారని చైనా ప్రభుత్వ మీడియా సీసీటీవీ తెలిపింది. క్రమశిక్షణ చట్టాలకు కట్టుబడి ఉండడం అతి ముఖ్యమైనదని తెలిపింది.


బీజీంగ్ పోలీసులు కూడా సోషల్ మీడియాలో పియానిస్ట్ చిత్రాన్ని పోస్ట్ చేసి ధృవీకరించారు.  2000లో లీ ఇంటర్నేషనల్ చోపిన్ పియానో పోటీల్లో విజేతగా నిలిచారు. పియానిస్ట్ ల కోసం ప్రతి ఐదేళ్లకు ఒకసారి ఈ పోటీలు నిర్వహిస్తారు. లీ 2015లో ఈ కార్యక్రమానికి న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2013లో చోంగ్ కింగ్ పేరుతో రాజకీయ సలహా సంఘాన్ని లీ ఏర్పాటు చేశారు. ఇదే ప్రభుత్వ ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది.  తాజాగా అతడి అరెస్ట్ వెనుక చైనా ప్రభుత్వం కుట్ర ఉందనే ఆరోపణలున్నాయి.

Latest News
 
వేడుకగా నటి అపర్ణాదాస్ వివాహం Wed, Apr 24, 2024, 10:42 AM
10 మందిని ముద్దు పెట్టుకోమన్నారు: హీరోయిన్ Wed, Apr 24, 2024, 10:41 AM
రూ.50 లక్షలు విరాళం అందించిన హీరో శివకార్తికేయన్ Tue, Apr 23, 2024, 10:07 PM
3డిలో రానున్న 'జై హనుమాన్' మూవీ Tue, Apr 23, 2024, 08:57 PM
'భజే వాయు వేగం' టీజర్ కి భారీ స్పందన Tue, Apr 23, 2024, 07:42 PM