బిగ్‌బాస్‌ షో: టాప్‌ 3లో వాళ్ళు ఉంటారు.. శ్వేత వర్మ

by సూర్య | Fri, Oct 22, 2021, 09:10 PM

బిగ్‌బాస్‌ షో ఎటు పోతుందో అర్థం కావడంలేదు అంటున్నారు నెటిజన్లు. స్ట్రాంగ్‌ కంటెస్టెంట్లను పంపించేసి ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చుకుంటున్నవారిని హౌస్‌లో ఉంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్‌ అయితే అందులో ఐదుగురు ఆడవాళ్లనే పంపించేయడంపై తీవ్రంగా మండిపడుతున్నారు. ముఖ్యంగా ఆరో వారంలో బయటకు వచ్చేసిన శ్వేత వర్మ ఎలిమినేషన్‌ను ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆమె హౌస్‌లోకి తిరిగి వస్తే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కానీ ఇప్పట్లో రీఎంట్రీ అనే ఆప్షన్‌ ఉండకపోవచ్చని తెలుస్తోంది.


ఇదిలా వుంటే తాజాగా శ్వేత వర్మ బిగ్‌బాస్‌ విన్నర్‌ ఎవరో చెప్పేసింది. వీజే సన్నీ విజేతగా నిలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంది. హౌస్‌లో అతడు స్ట్రాంగ్‌, పాపులర్‌ కంటెస్టెంట్‌ అని పేర్కొంది. ఇక ప్రియ, సన్నీకి మధ్య జరిగిన గొడవను ప్రస్తావిస్తూ.. వాళ్లిద్దరికీ కొట్లాట జరిగింది వాస్తవమే కానీ మెజారిటీ ప్రేక్షకులు అదంతా ప్రియ వల్లే జరిగిందని నిందిస్తూ సన్నీకి సపోర్ట్‌ చేస్తున్నారని చెప్పుకొచ్చింది. ఇక సన్నీతో పాటు మానస్‌, యానీ మాస్టర్‌ టాప్‌ 3లో ఉంటారని తెలిపింది.

Latest News
 
'హరోమ్ హర' సెకండ్ సింగల్ ప్రోమో విడుదలకి టైమ్ లాక్ Tue, Apr 23, 2024, 03:56 PM
'కృష్ణ ఫ్రొం బృందావనం' షూటింగ్ ప్రారంభం ఎప్పుడంటే..! Tue, Apr 23, 2024, 03:52 PM
'ప్రతినిధి 2' ని USAలో విడుదల చేస్తున్న ప్రముఖ బ్యానర్ Tue, Apr 23, 2024, 03:45 PM
తెలుగులో 'నాయట్టు'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? Tue, Apr 23, 2024, 03:39 PM
1M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'కూలీ' టైటిల్ టీజర్ Tue, Apr 23, 2024, 03:37 PM