"మా"లో మళ్లీ రగడ

by సూర్య | Fri, Oct 22, 2021, 07:24 PM

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ పలు వివాదాలకు కేరాఫ్‌గా మారింది. మా ఎన్నికల తీరుపై మరోసారి ప్రకాశ్ రాజు సంచలన కామెంట్స్ చేశారు. మా ఎన్నికల్లో రౌడీ షీటర్లు పాల్గొన్నారని అన్నారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటకు చెందిన రౌడీ షీటర్ నూకల సాంబశివరావు పోలింగ్ కేంద్రం లోపలికి వెళ్లి ఓటర్లను బెదిరించారని, మంచు విష్ణు‌కు అనుకూలంగా పోలింగ్ జరిగేలా ప్రభావితం చేశారని ఆరోపించారు. అసలు బయట వ్యక్తిని ఎలా అనుమంతిచారని ప్రకాశ్ రాజ్ ప్రశ్నించారు. సాంబ శివరావు వైసీపీ కార్యకర్త అని, పలు హత్య కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని అన్నారు. మా పోలింగ్‌లో సాంబ శివరావు ఉన్న ఫోటోలను విడుదల చేశారు. వీటి ఆధారంగా మా ఎన్నికల అధికారి కృష్ణ మోహన్‌కు ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై మరిన్ని ఆధారాలను కూడా బయటపెడతానని ప్రకాశ్ రాజ్ అన్నారు. వీటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Latest News
 
సూర్య కొత్త సినిమాపై అప్‌డేట్ Fri, Mar 29, 2024, 02:24 PM
లాంగ్ బ్లాక్ గౌన్ లో బుట్టబొమ్మలా రష్మీ Fri, Mar 29, 2024, 01:44 PM
మూవీ రివ్యూ: “టిల్లు స్క్వేర్” Fri, Mar 29, 2024, 12:45 PM
నేడు విడుదలకి సిద్ధమైన ‘గాడ్జిల్లా అండ్‌ కాంగ్‌’ Fri, Mar 29, 2024, 12:03 PM
ఏప్రిల్ 22న టైటిల్ చెబుతాం Fri, Mar 29, 2024, 12:01 PM