దుబాయ్ లో మాస్ మహారాజా ఖిలాడీ

by సూర్య | Fri, Oct 22, 2021, 06:08 PM

మాస్ మహారాజా రవితేజ  హీరోగా నటిస్తున్న సినిమా ఖిలాడీ. ఈ  సినిమాని  రమేష్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు.ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం మెజారిటీ భాగం షూటింగ్ ను పూర్తి చేసుకుంది. ఇక సాంగ్స్ ను పూర్తి చేయాల్సి ఉంది.ఈ  సినిమాలో  హీరోయిన్స్ గా మీనాక్షి చౌదరి, డింపుల్ హయతి నటిస్తున్నారు. రవితేజతో పాటు ఈ ఇద్దరు హీరోయిన్లు కూడా ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నారు. అక్కడ అందమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుగుతోంది. వీరు ముగ్గురిపై ఒక పాటను ప్రస్తుతం చిత్రీకరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటను యశ్వంత్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేస్తున్నాడు. ఈ పాట షూటింగ్ మరికొన్ని రోజుల పాటు దుబాయ్ లో సాగనుంది. ఖిలాడీ షార్ట్ గ్లిమ్ప్స్ కు రెస్పాన్స్ బాగానే వచ్చింది.

Latest News
 
జెమినీ టీవీలో ఆదివారం స్పెషల్ మూవీస్ Thu, Mar 28, 2024, 04:29 PM
శశివదనే : గోదారి అటువైపో సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Thu, Mar 28, 2024, 04:26 PM
డీజే టిల్లు పార్ట్ 3 ఉందా? Thu, Mar 28, 2024, 04:22 PM
'ప్రతినిధి 2' టీజర్ విడుదలకి తేదీ లాక్ Thu, Mar 28, 2024, 04:18 PM
ఒక ట్విస్ట్ తో డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన '105 మినిట్స్' Thu, Mar 28, 2024, 04:16 PM