నేను హర్ట్ అయ్య: షన్ను.. ఇక పై చూపిస్తా నా ఆట

by సూర్య | Fri, Oct 22, 2021, 04:54 PM

బిగ్ బాస్ లో భారీ అంచనాల నడుమ అడుగు పెట్టిన షణ్ముఖ్ జష్వంత్ మొదటి నుండి బిగ్ బాస్ ప్రేక్షకులను తన అభిమానులను కూడా నిరాశ పర్చుతున్నాడు. టాప్ కంటెస్టెంట్ గా హౌస్ లో అడుగు పెట్టిన షన్ను ను పదే పదే నాగార్జున ఏంట్రా ఇది ఎందుకు ఆడటం లేదు అంటూ అడుగుతూనే ఉన్నాడు. ఒక వారం కాకుంటే ఒక్క వారం అయినా బిగ్ బాస్ లో షన్ను గేమ్ కనిపిస్తుందేమో అంటూ అతడి అభిమానులు ఎదురు చూస్తున్నారు. కాని అతడి నుండి ఏమాత్రం ఎఫర్ట్ కనిపించడం లేదు.


ఈ ఎగ్స్ టాస్క్ లో కాస్త ఎఫర్ట్ పెట్టినట్లుగా అనిపించినా కూడా అతడిని వెర్రిపప్ప చేసి సిరి మరియు జెస్సీలు అతడి వద్ద ఉన్న ఎగ్స్ ను జీరో చేయడం జరిగింది. ఆ విషయం షన్నుకు బాగా గుచ్చుకున్నట్లుగా ఉంది. దానికి తోడు షన్ను సరదాగా నాకు కూడా ఒక సీక్రెట్ టాస్క్ ఇవ్వొచ్చు కదా బిగ్ బాస్ అంటూ ప్రశ్నించిన సమయంలో పక్కనే ఉన్న రవి టాస్క్ లు ఆడురా ఫస్ట్ అనడం.. ఆ మాటతో ఇంటి సభ్యులు అంతా కూడా గట్టిగా నవ్వడం జరిగింది. దాంతో షన్ను మరింతగా హర్ట్ అయ్యాడు.


ఎప్పుడు స్ట్రాంగ్ గా కనిపించే షన్ను కన్నీరు పెట్టుకున్నాడు. షన్ను కు స్నేహితులు అయిన సిరి మరియు జెస్సీలు కూడా ఎమోషనల్ అయ్యారు. నన్ను యదవను చేశారు గా అందరి ముందు అంటూ షన్ను అన్న మాటలు సిరికి బాగా గుచ్చుకున్నట్లుగా అనిపించింది. జెస్సీ సీక్రెట్ టాస్క్ అనగానే సిరిని ఎంపిక చేసుకోవడం పెద్ద తప్పు. అతడు చెప్పిన వెంటనే షన్ను వద్దకు వెళ్లి ఎగ్స్ జీరో చేసుకోమని సిరి అడగడం తప్పు. షన్ను ను కాకుండా ఇతర సభ్యుల వద్ద ఎగ్స్ లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కాని రిక్వెస్ట్ చేసి ముగ్గురు సభ్యుల ఎగ్స్ లేకుండా చేయడం విడ్డూరంగా ఉందంటూ బిగ్ బాస్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. రిక్వెస్ట్ లు చేసి కాకుండా బలవంతంగా అవతలి వారి నుండి ఎగ్స్ లాక్కుని జీరో చేయాల్సి ఉండగా షన్నును నిజంగాన యదవను చేసి అతడి ఎగ్స్ ను తీసుకోవడం జరిగింది.


ఒక వేళ షన్ను కనుక ఎగ్స్ ఇచ్చి ఉండకుంటే ఖచ్చితంగా కెప్టెన్సీ టాస్క్ కంటెండర్ గా ఉండేవాడు. ఈ విషయం షన్నుకు చాలా ఇబ్బంది కలిగిస్తుంది. ఇప్పటికే షన్ను అస్సలు టాస్క్ లు ఆడటం లేదు అంటూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో షన్ను ను ఇలా సిరి మరియు జెస్సీలు కూడా యదవను చేశారంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్  లో షన్ను ఖచ్చితంగా ఓ రేంజ్ ఆటను ఆడుతాడని అంతా ఆశిస్తే అతడు మాత్రం చప్పగా సాగిపోతున్నాడు. ఫైనల్ 5 కంటెస్టెంట్ గా ఎలాగూ ఉంటాడు. కాని అతడి వల్ల హౌస్ కు ఎలాంటి ప్రయోజనం మాత్రం లేదని ప్రేక్షకులు భావిస్తున్నారు.


సారు ఎలిమినేషన్ కు నామినేట్ అయితే ఖచ్చితంగా అత్యధిక ఓట్లను దక్కించుకుంటున్నాడట. కాని హౌస్ లో మాత్రం గేమ్ పరంగా మాత్రం లాస్ట్ లో ఉంటున్నాడు. ఈ విషయాన్ని స్వయంగా అతడే ఒప్పుకున్నట్లుగా తాజా ఎసిసోడ్ లో మాట్లాడాడు. స్నేహితుల నుండి బయటకు వచ్చి ఇకపై అయినా స్ట్రాంగ్ గా ఉండి కష్టపడి ఆడుతాడేమో చూడాలి. రేపటి ఎపిసోడ్ లో నాగార్జున ఖచ్చితంగా షన్ను అండ్ బ్యాచ్ ను ఓ రేంజ్ లో ఆడేసుకునే అవకాశం ఉందంటున్నారు. 

Latest News
 
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM
'బడే మియాన్ చోటే మియాన్' డిజిటల్ ఎంట్రీపై లేటెస్ట్ బజ్ Fri, Apr 19, 2024, 07:41 PM
'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ ఈ తేదీన విడుదల కానుందా? Fri, Apr 19, 2024, 06:07 PM
బెల్లంకొండ శ్రీనివాస్ తదుపరి చిత్రానికి క్రేజీ టైటిల్ Fri, Apr 19, 2024, 06:05 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'RRR' Fri, Apr 19, 2024, 06:04 PM