‘మా’లో మరో బిగ్ ట్విస్ట్.. రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ ఆరోపణ

by సూర్య | Fri, Oct 22, 2021, 03:44 PM

మా’ ఎన్నికల్లో ట్విస్ట్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. సీరియల్ ఎపిసోడ్ లా కొనసాగుతూనే ఉంది. లేటెస్ట్ గా మరో బాంబు పేల్చారు మోనార్క్ ప్రకాష్ రాజ్.. రౌడీషీటర్లు ‘మా’ ఎన్నికలను ప్రభావితం చేశారని ప్రకాష్ రాజ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఇదే విషయాన్ని మరోసారి ఈసీ కృష్ణమోహన్ దృష్టికి తీసుకెళ్లారు. పోలింగ్ రోజున జరిగిన తిట్ల దండకం బెదిరింపులకు సంబంధించి సీసీ ఫుటేజ్ ఇవ్వాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు మరోసారి రౌడీషీటర్ల పాత్ర ఉందంటూ లేఖాస్త్రం సంధించారు.


‘మా’ ఎన్నికల్లో ఓటమిని ప్రకాష్ రాజ్ అంత ఈజీగా మరిచిపోవడం లేదు. అక్రమాలు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ ఆ నిజాలన్నీ జనాలందరికీ తెలపాలని కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది. పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియలో సామాజిక వ్యతిరేకుల ఉనికి ఉందంటూ పదే పదే ప్రశ్నించామని.. అలాంటి వారిని కౌంటింగ్ ప్రాంతాలకు అనుమతించారని ఆరోపించారు. ఆ ఆరోపణపై మీరు ఖండించారంటూ ఈసీ రాసిన లేఖలో ప్రకాష్ రాజ్ పేర్కొన్నారు. విష్ణు ప్యానెల్ నుంచి నల్ల బ్యాడ్జీలతో ఎందుకు అనుమతించారని ప్రకాష్ రాజ్ ప్రశ్నించారు.


ఎన్నికల అధికారిగా ‘మా’కి సంబంధం లేని వ్యక్తులను అనుమతించకూడదు. కానీ అవేవీ పట్టించుకున్నట్లు కనిపించట్లేదని లేఖలో ప్రకాష్ రాజ్ ఆరోపించారు. ప్రధానంగా ‘మా’ ఎన్నికల్లో రౌడీషీటర్ నూకల సాంబశివరావు పాల్గొన్నారని ప్రకాష్ రాజ్ ఆరోపిస్తున్నారు. ఇతడిపై జగ్గయ్యపేట పీఎస్ లో రౌడీషీట్ ఉందని..గతంలో ఓ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్నారనితెలిపారు. అనేక బెదిరింపులు సెటిల్ మెంట్లు కేసులు ఉన్నాయని తెలిపారు. నోట్ల రద్దు సమయంలో కోట్ల రూపాయలు తరలిస్తుండగా.. అడ్డుకోబోయిన ఎస్సైని కారుతో ఢీకొట్టాలనిచూశాడని ఆరోపణలున్నాయి.


ఈ క్రమంలోనే ప్రకాష్ రాజ్ మా ఎన్నికల్లో క్రిమినల్ బ్యాగ్రౌండ్ ఉన్నవారిని అనుమతించినట్టు ఆధారాలు సేకరించారు. స్పష్టమైన సీసీ ఫుటేజ్ ఇవ్వాలని కోరారు. కొంతమంది పోలింగ్ రోజున హాల్ లోనే తిరిగారని ప్రకాష్ రాజ్ ఆరోపించారు.

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM