ఆర్యన్ తో అనన్య వాట్సాప్ చాట్!

by సూర్య | Fri, Oct 22, 2021, 03:18 PM

బాలీవుడ్ ఇండస్ట్రీకి డ్రగ్స్ కేసు కుదిపేస్తోంది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరోయిన్ అనన్య పాండే ఎన్సీబీ ఎదుట హాజరైంది. తండ్రి, నటుడు చుంకీ పాండేతో కలిసి ఆమె ఎన్సీబీ కార్యాలయానికి చేరుకుంది. ఈరోజు ఉదయం అనన్య పాండే ఇంట్లో సోదాలు నిర్వహించిన ఎన్సీబీ అధికారులు ఆమె ఫోన్, ల్యాప్‌టాప్‌ను సీజ్ చేశారు. ఈ నెల 2న జరిగిన క్రూజ్ షిప్ రేవ్ పార్టీలో డ్రగ్స్ కావాలని ఆర్యన్.. అనన్యకు వాట్సాప్ చాట్ చేసినట్లు సమాచారం.అంతేకాకుండా.. ఈ చాట్ లో అనన్య పాండేతో పాటు ఆర్యన్ సోదరి సుహానా ఖాన్ కూడా ఉన్నట్లు సమాచారం. వీరంతా స్టార్ హీరోల పిల్లలు కావడంతో అందరికీ ఓ కామన్ వాట్సాప్ గ్రూప్ ఉన్నట్లు తెలుస్తుంది. 2019లో 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' సినిమాతో బాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అనన్య పాండే. ఆ తరువాత 'పతి పత్ని ఔర్ వాహ్'తో మంచి విజయాన్ని అందుకుంది.


Latest News
 
'కుబేర' కీలక షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న రష్మిక Thu, Apr 25, 2024, 05:41 PM
షూటింగ్ పూర్తి చేసుకున్న నిహారిక తమిళ చిత్రం Thu, Apr 25, 2024, 05:38 PM
OTT : తెలుగు మరియు ఇతర భాషల్లో డిజిటల్‌ ఎంట్రీ ఇచ్చేసిన 'OMG 2' Thu, Apr 25, 2024, 05:36 PM
సుహాస్ తదుపరి విడుదలకు సాలార్ మేకర్స్ మద్దతు Thu, Apr 25, 2024, 05:34 PM
త్వరలో 'విదా ముయార్చి' ఫస్ట్ లుక్ విడుదల అనౌన్స్మెంట్ Thu, Apr 25, 2024, 04:16 PM