నాని గ్యాంగ్ లీడర్ మూవీ మూడు భాష రీమేక్ ?

by సూర్య | Fri, Jun 11, 2021, 11:28 AM

నేచురల్ స్టార్ నాని.. ఫ్యామిలీ ఆడియన్స్ నుండి యూత్ వరకు, పెద్ద వాళ్ళ నుండి చిన్నవాళ్ల వరకు ఎక్కువమంది ఇష్టపడే హీరో. నాని విషయానికి వచ్చేసరికి క్లాస్, మాస్ అనే డిఫరెన్స్ ఉండదు. ఇలా, అందరినీ మెప్పిచింది  గ్యాంగ్ లీడర్ మూవీ ,సాధారణంగా ఏ భాషలో అయినా.. సూపర్ హిట్టైన సినిమానే రీమేక్ గా చేయాలను కుంటారు. అది కూడా సబ్జెక్ట్ యూనిక్ గా ఉంటేనే. అయితే కొన్ని సినిమాలు కాన్సెప్ట్ బాగాన్నప్పటికీ, స్ర్కీన్ మీద అంత ప్రభావవంతంగా కన్సీవ్ కాలేక చతికిల పడుతుంటాయి. అలాంటి సినిమాల్ని మరింత బెటర్ గా మార్చుకుంటే.. రీమేక్ చేయడానికి అర్హత సాధించినట్టే. అలాంటి ఓ సినిమా నానీ ‘గ్యాంగ్ లీడర్’.విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందిన నానీ గ్యాంగ్ లీడర్ .. కాన్సెప్ట్ బాగానే ఉంటుంది. అయితే ఎందుకనో సినిమా ఆశించిన రీతిలో మ్యాజిక్ చేయలేకపోయింది. ఒక స్ట్రగుల్డ్ రైటర్..  కొందరు మహిళల రివెంజ్ తీర్చడానికి సహాపడతాడు. ఈ కథాంశంతో ఔట్ అండ్ ఔట్ కామెడీతో.. కాసిన్ని ఎమోషన్స్ తో సినిమాను తెరకెక్కించాడు విక్రమ్ కుమార్. నానీ తన పాత్రను అద్భుతంగా పోషించాడు. అయినా  ఎక్కడో తేడా కొట్టింది.అయినప్పటికీ .. ఈ సినిమాను తమిళ, మలయాళ, హిందీ భాషల్లో సైతం రీమేక్ కానుండడం విశేషమని చెప్పాలి. 

Latest News
 
ఫ్యామిలీ స్టార్ : నంద నందనా వీడియో సాంగ్ అవుట్ Tue, Apr 23, 2024, 06:40 PM
'హరోమ్ హర' లోని కనులెందుకో సాంగ్ ప్రోమో అవుట్ Tue, Apr 23, 2024, 06:38 PM
TFDA సంక్షేమానికి 35 లక్షలు విరాళంగా ఇచ్చిన ప్రభాస్ Tue, Apr 23, 2024, 06:35 PM
OTT : విడుదల తేదీని లాక్ చేసిన 'నయట్టు' తెలుగు వెర్షన్ Tue, Apr 23, 2024, 06:30 PM
తన తొలి కన్నడ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ఐశ్వర్య రాజేష్ Tue, Apr 23, 2024, 06:20 PM