బిగ్ బాస్‌5 లో పాల్గొన‌డంపై స్పందించిన పాయ‌ల్

by సూర్య | Fri, Jun 11, 2021, 09:20 AM

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో విజ‌యవంతంగా నాలుగు సీజ‌న్స్ పూర్తి చేసుకొని ఐదో సీజ‌న్‌కు స‌న్న‌ద్ధ‌మైంది. మ‌రి కొద్ది రోజుల‌లో మొద‌లు కానున్న ఈ షోకు సంబంధించి జూమ్ ద్వారా కంటెస్టెంట్స్ ఎంపిక ప్ర‌క్రియ జ‌రుగుతుంద‌ని స‌మాచారం. అయితే ఐదో సీజ‌న్‌ని మ‌రింత స్పెష‌ల్‌గా ప్లాన్ చేస్తున్న నేప‌థ్యంలో ఆర్ఎక్స్ 100 బ్యూటీ పాయ‌ల్ రాజ్‌పుత్‌ని షో కోసం ఎంపిక చేసిన‌ట్టు కొన్నాళ్లుగా ప్ర‌చారం న‌డుస్తుంది. ఈ విష‌యం పాయ‌ల్ ద‌గ్గ‌ర‌కు కూడా చేర‌డంతో వెంటనే త‌న సోష‌ల్ మీడియా ద్వారా స్పందించింది.


నేను బిగ్ బాస్ సీజన్ 5 కార్య‌క్ర‌మంలో పాల్గొన‌బోతున్న‌ట్టు వ‌స్తున్న వార్త‌లు అవాస్త‌వం. అది ఫేక్ న్యూస్. ఇలాంటి వార్త‌ల‌లోకి న‌న్ను లాగొద్దు అంటూ పాయ‌ల్ రాజ్‌పుత్ త‌న ట్విట్టర్‌లో పేర్కొంది. ప్ర‌స్తుతం పాయ‌ల్ కెరియ‌ర్ అంత ఆశాజ‌న‌కంగా లేదు.ఆర్ఎక్స్ 100 చిత్రం త‌ర్వాత ఈ అమ్మ‌డికి ఒక్క పెద్ద హిట్ కూడా లేక‌పోవ‌డంతో మంచి హిట్ కోసం త‌హ‌త‌హ‌లాడుతుంది. ప్ర‌స్తుతం ఓ త‌మిళ చిత్రంలో న‌టిస్తున్న‌ట్టు స‌మాచారం.

Latest News
 
'ప్రేమలు' సినిమాకి సీక్వెల్ రెడీ Fri, Apr 19, 2024, 11:34 PM
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM