రేప్ చేసే టైంకి అమ్మాయి బోరున ఏడ్చేసింది : యాక్టర్ అజయ్

by సూర్య | Thu, Jun 10, 2021, 04:50 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్ గా పాపులర్ అయిన నటులు అప్పుడప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారుతుంటారు. అలా కెరీర్ ప్రారంభం నుండి విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చినటువంటి యాక్టర్స్ సమయం సందర్బం వచ్చినప్పుడు లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ బయట పెడుతుంటారు.  ఇన్నేళ్లు సినిమాలో విలన్ రోల్స్ చేసుకుంటూ వచ్చిన ఓ పాపులర్ యాక్టర్.. తనకు ఎదురైన ఇబ్బందికరమైన సందర్భాలు తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆ యాక్టర్ ఎవరో కాదు అజయ్ 


ఇంతవరకు ఒక్కసారి కూడా తన లైఫ్ గురించి ఫుల్ ఇంటర్వ్యూ ఇవ్వలేదు అజయ్. తాజాగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో హాజరై చాలా విషయాలు చెప్పాడు. అయితే అన్ని విషయాలు అడుగుతూనే మధ్యలో ఇంటర్వ్యూ చేసే వ్యక్తి.. ఇంత సిగ్గుపడే మీరు మీ కెరీర్ లో రేప్ సీన్స్ ఎలా చేశారు? అనే ప్రశ్నకు అజయ్ ఈ విధంగా సమాధానం ఇచ్చాడు. అయితే అజయ్ మాట్లాడుతూ.. నా లైఫ్ లో ఒకే ఒక్క రేప్ సీన్ చేసినట్లు గుర్తు. అదికూడా శ్రీహరి గారు హీరోగా చేసిన 'మహాలక్ష్మి' అనే సినిమాలో చేసాను. అయితే ఆ సినిమా షూటింగ్ సమయంలో ఓ రేప్ సీన్ ఉంది. ఆ సీన్ కోసం ఓ మోడల్ ను పిలిపించారు. నాకు రేప్ సీన్ అని చెప్పారు. నేను ప్రిపేర్ అయిపోయి ఉన్నాను. కానీ ఆ మోడల్ కు రేప్ సీన్ అనే విషయం చెప్పలేదు డైరెక్టర్ విజయన్ గారు. టైం అయింది. ఆ మోడల్ షాట్ లోకి వచ్చింది కానీ ఏం సీన్ అనేది ఆమెకు తెలియదు. డైరెక్టర్ గారు యాక్షన్ చెప్పారు కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు. సార్ ఆ మోడల్ కి సీన్ చెప్పకుండా ఎలా సార్.. అనేలోపు ఆమె బావురుమని ఏడుపు స్టార్ట్ చేసింది. ఆ వెంటనే నాకు ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. సార్ ఇలాగైతే నేను చేయలేను అన్నాను. కానీ ఆ టైంలో మోడల్ కు సీన్ ఎక్సప్లయిన్ చేసి ఎలాగో చేసేసాం.. అయితే నా కెరీర్ లో ఎక్కువగా రేప్ సీన్స్ రాలేదు. చాలా హ్యాపీ." అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు అజయ్.

Latest News
 
అజిత్ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో? Fri, Apr 19, 2024, 05:11 PM
'పుష్ప 2' హిందీ హక్కుల కోసం అనిల్ థాడాని ఎంత చెల్లించాడంటే...! Fri, Apr 19, 2024, 05:09 PM
'తలైవర్ 171' టైటిల్ టీజర్ విడుదలకి తేదీ ఖరారు Fri, Apr 19, 2024, 04:49 PM
OTT పార్టనర్ ని లాక్ చేసిన 'బడే మియాన్ చోటే మియాన్' Fri, Apr 19, 2024, 04:46 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన '777 చార్లీ' హిందీ వెర్షన్ Fri, Apr 19, 2024, 04:22 PM