మన దేశంలో అన్ని చోట్ల ఆక్సీజన్ ప్లాంట్ ఉండాలి : సోనూసూద్?

by సూర్య | Thu, Jun 10, 2021, 03:04 PM

దేశ వ్యాప్తంగా సోనూ సూద్ మొత్తం 18 ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించారు. ఏపీ తెలంగాణ తో పాటు మరో 16 రాష్ట్రాల్లో సోనూసూద్ ఈ ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. సెకండ్ వేవ్ లో ఆక్సిజన్ కొరతను గుర్తు ఉంచుకుని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్టు సూనూసూద్ వెల్లడించారు. ఆక్సిజన్ ప్లాంట్ ల ద్వారా ఒక్క వ్యక్తి కూడా మరణించకుండా కాపాడవచ్చని ఆయన భావిస్తున్నట్టు సోనూ వెల్లడించారు. ఒక్క వ్యక్తి ప్రాణం పోకుండా కాపాడటమే తన లక్ష్యం అని సోనూ సూద్ అన్నారు. అంతే కాకుండా ఈ ఆక్సిజన్ ప్లాంట్ ల ద్వారా సమస్యను మూలాల నుండి తొలంగించవచ్చని సోనూ అన్నారు. 18 ఆక్సిజన్ ప్లాంట్ లు దాదాపు 5,500 పడకల ఆక్సిజన్ కొరతను తీర్చగలవని అన్నారు. తన బృందం తో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సోనూసూద్ పేర్కొన్నారు. ఈ కష్ట సమయాల్లో అందరం కలిసి వచ్చి పేదవారికి సహాయం చేద్దామని సోనూసూద్ వ్యాఖ్యానించారు. కరోనా 3వ వేవ్ 4వేవ్ అంటూ వేచి చూడకుండా పరిష్కారం కోసం ఆలోచించాలని సోనూసూద్ అన్నారు. వచ్చే నెలలో తాను ఈ ఆక్సిజన్ ప్లాంట్ లను ఏర్పాటు చేయబోతున్నట్టు స్పష్టం చేశారు

Latest News
 
మెగాస్టార్​ చిరంజీవితో రష్యా ప్రతినిధుల సమావేశం Fri, Apr 19, 2024, 08:54 PM
100M స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గామి' Fri, Apr 19, 2024, 08:23 PM
'భజే వాయు వేగం' టీజర్ విడుదలకి టైమ్ లాక్ Fri, Apr 19, 2024, 08:21 PM
విజయ్ దేవరకొండ స్పై థ్రిల్లర్‌పై తాజా అప్డేట్ Fri, Apr 19, 2024, 07:58 PM
'గుడ్ బ్యాడ్ అగ్లీ' లో SJ సూర్య Fri, Apr 19, 2024, 07:43 PM